Thursday, March 5, 2026
Homeఇంటర్నేషనల్Dubai: యుద్ధ సెగ.. దుబాయ్ విమానాశ్రయాలు మూసివేత!

Dubai: యుద్ధ సెగ.. దుబాయ్ విమానాశ్రయాలు మూసివేత!

Dubai airport: పశ్చిమ ఆసియాలో యుద్ధ పరిస్థితులు తీవ్రతరం కావడంతో అంతర్జాతీయ విమానయాన రంగం అతలాకుతలమవుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న భీకర పోరు నేపథ్యంలో భద్రతా కారణ దృష్ట్యా దుబాయ్‌లోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అక్కడి విమానాశ్రయ యంత్రాంగం ప్రకటించింది.

- Advertisement -

దుబాయ్‌ ప్రకటన: ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణికుల భద్రతే తమకు ప్రాధాన్యమని దుబాయ్ విమానాశ్రయ యంత్రాంగం ప్రకటించింది. అందుకే విమాన రాకపోకలను నిలిపివేస్తున్నామని దుబాయ్ ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఎవరూ విమానాశ్రయాలకు రావొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారు.. తమ విమాన స్థితిగతులKhamenei: సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఇరాన్! గురించి ఆయా ఎయిర్‌లైన్స్ సంస్థలను సంప్రదించాలని సూచించారు.

Also read-Khamenei: సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఇరాన్!

భారత్‌పై తీవ్ర ప్రభావం: దుబాయ్ విమానాశ్రయాల మూసివేత ప్రభావం భారతీయ విమానయాన రంగంపై గట్టిగా పడింది. దుబాయ్‌కు అత్యధిక సర్వీసులు నడిపే ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి ప్రముఖ సంస్థలు తమ విమానాలను రద్దు చేశాయి. దిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల నుంచి దుబాయ్ వెళ్లాల్సిన వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. దీంతో గమ్యస్థానాలకు చేరుకోలేక, అటు ఇంటికి వెళ్లలేక ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లోనే ఉండిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News