Dubai Princess: దుబాయ్ ప్రిన్సెస్ షేకా మహ్రా మొహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో భర్తకు విడాకులు ఇచ్చి దుబాయ్ ప్రిన్సెస్ గతేడాది సెన్సేషన్ గా మారింది. ప్రముఖ ర్యాపర్ ఫ్రెంచ్ మోంటానాతో షేకా మహ్రాకు నిశ్చితార్థం జరిగింది. ఈవిషయాన్ని ర్యాపర్ అధికార ప్రతినిధి ధ్రువీకరించినట్లు ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. విడాకులు ప్రకటించిన కొన్నాళ్లకే షేకా మహ్రా.. మోంటానాతో కలిసి దుబాయ్ వీధుల్లో కన్పించారు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన పారిస్ ఫ్యాషన్ వీక్‌లోనూ ఇద్దరు కలిసి కన్పించారు. ఆ సమయంలోనే వీరికి ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read Also: Viral Video: ముంబై గణేశుడి దర్శనానికి 18 కిలోమీటర్ల క్యూ..!
గతేడాది భర్తకు విడాకులు
దుబాయ్ పాలకుడు, యూఏఈ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తెనే 31 ఏళ్ల షేకా మహ్రా. బ్రిటన్‌లో ఎడ్యూకేషన్ పూర్తి చేసిన ఆమె అంతర్జాతీయ వ్యవహారాల్లో పట్టా పొందారు. మహిళా సాధికారతకు కృషి చేస్తున్నారు. దుబాయ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షేక్ మనా బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్‌తో మే 27, 2023న మహ్రాకు వివాహం జరిగింది. అయితే, ఈ రిలేషన్ ఎంతోకాలం నిలువలేదు. గతేడాది బిడ్డకు జన్మనిచ్చిన కొంతకాలానికే ఆమె భర్త నుంచి విడిపోయారు. ఆ సమయంలో ‘ఐ డివోర్స్ యూ’ అంటూ ఇన్‌స్టాలో విడాకుల ప్రకటన చేసి సంచలనంగా మారారు. ఆ తర్వాత ‘డివోర్స్’ పేరుతో పర్‌ఫ్యూమ్ విక్రయాలు ప్రారంభించారు. ఇక, మొరాకో-అమెరికన్ అయిన 40 ఏళ్ల ర్యాపర్ ఫ్రెంచ్ మోంటానా.. ‘అన్‌ఫర్‌గటబుల్’, ‘నో స్టైలిస్ట్’ వంటి ఆల్బమ్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను పొందారు. మోంటానా గతంలో వ్యాపారవేత్త నదీన్‌ను వివాహం చేసుకొని విడిపోయారు. మొదటి భార్యతో ఆయనకు 16 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.
Read Also: Kangana: బెడ్ షీట్ రక్తంతో నిండిపోయింది.. భయపడ్డా- కంగనా


