Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Earthquake: సౌత్ అమెరికాలో భారీ భూకంపం..!

Earthquake: సౌత్ అమెరికాలో భారీ భూకంపం..!

Earthquake: సౌత్ అమెరికా సమీపంలో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం 7.46గంటలకు దక్షిణ అక్షాంశం మరియు 61.85 W రేఖాంశం వద్ద 10.8 కి.మీ  లోతులో భూకంపం సంభవించింది. ప్రస్తుతానికి, ఆ ప్రాంతంలో ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ  చేయలేదు. ఇది సరిగ్గా అమెరికా సమీపంలోని డ్రేక్ పాసేజ్‌లో జరిగింది. సౌత్ అమెరికా, అంటార్కిటికా మధ్య ఉన్న డ్రేక్ పాసేజ్ ప్రాంతంలో  శుక్రవారం శక్తివంతమైన భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. ఇంతకుముందే ఇక్కడ భూకంపం సంభవిస్తుందని అధికారులు తెలిపారు. దాని భూకంప తీవ్రత 8 తీవ్రతతో ఉంటుందని అంచనా వేశారు. కానీ USGS మాత్రం దానిని 7.5 తీవ్రతకు తగ్గించింది. ఈ భూకంప తీవ్రతను పలుదేశాలు అంచనా వేశాయి. అందులో భాగంగా… జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GRCG) భూకంపం 7.1 తీవ్రతతో నమోదైందని తెలిపింది. మరోవైపు, భారత జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (NCS) భూకంప తీవ్రతను 7.4గా అంచనా వేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad