Elon Musk on AI ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ రాక.. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో.. గత కొంతకాలంగా జరుగుతున్న లేఆఫ్‌లే ఉదాహరణ. ఏఐ ప్రభావం ఇతర రంగాల్లోనూ కనపడుతోంది. ఈ క్రమంలో ఉద్యోగులు తమ స్కిల్స్‌ను మెరుగుపరుచుకుంటే కానీ ఆయా రంగాల్లో రాణించలేరు. ఈ నేపథ్యంలో ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఏఐపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్‌లో జరిగిన యూఎస్- సౌదీ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరమ్‌లో మస్క్ మాట్లాడారు.
ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ రాకతో పేదరికాన్ని నిర్మూలించవచ్చని ఎలాన్ మస్క్ కానున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఉద్యోగం అనేది ఆప్షనల్ కానుందని వెల్లడించారు. డబ్బు కూడా అసంబద్ధంగా మారనుందని.. రాబోయే రోజుల్లో చేయడానికి పనులు కూడా ఏమీ ఉండవని మస్క్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనికి పదేళ్లయినా.. ఇరవై ఏళ్లయినా పట్టొచ్చని పేర్కొన్నారు.
‘ఉద్యోగం అనేది అవసరం కోసం కాకుండా అభిరుచిని బట్టి చేసే రోజులు రానున్నాయి. ఇప్పుడు స్పోర్ట్స్ లేదా వీడియో గేమ్ ఎలా ఆడుతున్నామో.. మున్ముందు ఉద్యోగం కూడా అంతే. ఏఐ వల్ల భవిష్యత్తులో డబ్బు అవసరం కూడా పెద్దగా ఉండబోదు. అవసరమైన వారు స్టోర్‌కి వెళ్లి కూరగాయలు కొనుక్కుంటారు.. లేదంటే ఇంటి పెరట్లోనే పండించుకుంటారు. ఏఐ, రోబోటిక్స్ అనేవి పేదరికాన్ని పూర్తిగా రూపుమాపుతాయి. పేదరికం సామాజిక సమస్య కాదు.. ఇంజినీరింగ్ సమస్య.. దానిని ఏఐ సరిచేస్తుంది.’ అని మస్క్ వివరించారు.
ఏఐ, రోబోటిక్స్‌తో ప్రాథమిక వస్తువుల ఖర్చు, సేవల ఖర్చు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని మస్క్ అన్నారు. పేదరికాన్ని పారదోలడానికి ఎన్జీఓలు కృషి చేస్తున్నా.. ఏఐ, రోబోలతో ఆ పని మరింత సులభతరం కానుందని వ్యాఖ్యానించారు. ఇవి అందరినీ ధనవంతులుగా మారుస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏఐ, హ్యూమనాయిడ్ రోబోల తయారీలో టెస్లా అగ్రగామిగా ఉండబోతుందన్న మస్క్.. ఇతర కంపెనీలు సైతం వీటిని తయారుచేస్తాయని ఉద్ఘాటించారు.
Also Read: https://teluguprabha.net/international-news/cop30-climate-talks-finance-fossil-fuels-lmdc/
కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌కు వైట్‌హౌస్‌లో విందు ఇచ్చారు. ఈ విందుకు మస్క్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్.. మూడుసార్లు మస్క్ పేరును ప్రస్తావించి ప్రాధాన్యతనిచ్చారు. దీంతో ఇరువురి మధ్య విభేదాలు తొలిగిపోయినట్లుగా కనిపిస్తోంది.

