ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్(Elon Musk )మరో వివాదంలో చిక్కుకున్నారు. తన బిడ్డకు మస్క్ తండ్రి అంటూ రచయిత్రి, ఇన్ఫ్లూయెన్సర్ ఆష్లీ సెయింట్ క్లెయిర్ సంచలన పోస్ట్ చేసింది. తన బిడ్డ మస్క్‌కు 13వ సంతానమని తెలిపింది. బిడ్డ భద్రతను, గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఇన్ని రోజులు ఈ విషయం బయటపెట్టలేదని పేర్కొంది. దీనిని గోప్యంగా ఉంచాలనుకున్నామని అయితే కొన్ని మీడియా సంస్థలు బహిర్గతం చేయడంతో ఇప్పుడు తానే స్వయంగా ఈ విషయాన్ని చెబుతున్నానని తెలిపింది. అయితే ఈ ఆరోపణలపై మస్క్ ఇప్పటివరకు స్పందించలేదు.
కాగా మస్క్ ఇప్పటివరకు భార్య, లవర్స్ ద్వారా మొత్తం 12 మంది పిల్లలకు జన్మనివ్వడం గమనార్హం. మొదటి భార్య జస్టిన్ ద్వారా కలిగిన తొలి సంతానం పుట్టిన పది వారాల్లోనే చనిపోయింది. ఆ తర్వాత ఐవీఎఫ్ విధానంలో ఈ జంట ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. అనంతరం 2008లో వీరు విడిపోయారు. ఆ తర్వాత కెనెడియన్ సింగర్ గ్రిమ్స్ ద్వారా ముగ్గురు పిల్లలు, న్యూరాలింక్ ఉద్యోగితో మరో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చినట్లు మస్క్ తెలిపారు. ఇదిలా ఉంటే మస్క్‌పై గతంలోనూ ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. తన కంపెనీలోని మాజీ ఉద్యోగినులతో పిల్లలను కన్నాలని ఫోర్స్ చేసినట్లు ప్రచారం జరిగింది.