Wednesday, February 19, 2025
Homeఇంటర్నేషనల్Elon Musk: ప్రధాని మోదీకి ఎలాన్ మాస్క్ అరుదైన గిఫ్ట్.. ఏంటంటే?

Elon Musk: ప్రధాని మోదీకి ఎలాన్ మాస్క్ అరుదైన గిఫ్ట్.. ఏంటంటే?

ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన ముగిసింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ప్రధాని అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్యంపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఈ భేటీకి ముందు ఎలాన్ మస్క్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. వాషింగ్టన్‌లోని బ్లేయిర్ హౌజ్‌లో ప్రధానిని మస్క్ తన పిల్లలతో కలిశారు. అంతకుముందు, అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బర్డ్‌తో మోడీ సమావేశమై, భారత్-అమెరికా స్నేహానికి సంబంధించిన అంశాలపై చర్చించారు.

- Advertisement -

అయితే ఈ సందర్భంగా మస్క్ ప్రధాని మోడీకి ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు అందర్ని ఆకర్షిస్తోంది. మస్క్ స్పేస్ ఎక్స్ రాకెట్ అయిన స్టార్ షిప్ కి చెందిన హీట్ షీల్డ్ నుంచి రాలిపడిన టైల్‌ని గిఫ్ట్‌గా ఇచ్చారు. స్టార్ షిప్ నుంచి ఈ టైల్ రాలిపడింది. స్టార్ షిప్ హీట్ షీల్డ్ టైల్స్, హెగ్జాగోనల్ ఆకారంలో ఉండే సిరామిక్ టైల్స్. ఇవి అంతరిక్ష నౌకలు మళ్లీ భూమిపైకి తిరిగి వచ్చే క్రమంలో కీలకంగా మారుతాయి.

అంతరిక్ష నౌక భూమి వాతావరణంలోకి వచ్చే సమయంలో విపరీతమైన ఘర్షణ ఏర్పడుతుంది. దీని నుంచి పుట్టే ఉష్ణోగ్రత నుంచి సిరామిక్ టైల్స్ అంతరిక్ష నౌకని రక్షిస్తాయి. ఈ టైల్స్ వందల డిగ్రీల వేడిని తట్టుకుని, అంతరిక్ష నౌకలకు నష్టం కలగకుండా చూస్తుంది. దీనిని ప్రధానికి మస్క్ గిఫ్ట్ గా ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News