Friday, January 23, 2026
Homeఇంటర్నేషనల్Elon Musk: 'నా పార్ట్‌నర్‌కి భారతీయ మూలాలు.. కొడుకు పేరులో శేఖర్!'.. మస్క్ నోట ఆసక్తికర...

Elon Musk: ‘నా పార్ట్‌నర్‌కి భారతీయ మూలాలు.. కొడుకు పేరులో శేఖర్!’.. మస్క్ నోట ఆసక్తికర విషయాలు

Elon Musk Reveals Indian Connection: టెక్ ప్రపంచంలో రారాజు, టెస్లా మరియు స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నిత్యం వార్తల్లో ఉండే మస్క్, ఈసారి మన భారతీయులకు ఒక స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. తనకు భారతదేశంతో ఉన్న ఒక వ్యక్తిగత బంధాన్ని బయటపెట్టారు. తాజాగా జెరోధా (Zerodha) వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన ‘WTF is?’ పాడ్‌కాస్ట్‌లో మస్క్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తన పార్టనర్ షివాన్ జిలిస్ (Shivon Zilis) సగం భారతీయురాలేనని (Half-Indian), ఆమె మూలాలు భారత్‌తో ముడిపడి ఉన్నాయని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు, వారి కొడుకు పేరులో కూడా భారతీయత ఉట్టిపడేలా Sekhar (శేఖర్) అనే పదం ఉందని చెప్పారు.

- Advertisement -

ALSO READ: AI Job Loss: రాబోయే పదేళ్లలో 30 లక్షల ఉద్యోగాలకు ఎసరు.. AI ధాటికి ఆ రంగాలు కనుమరు

పేరు వెనుక పెద్ద కథే ఉంది

“మీకు ఈ విషయం తెలుసో లేదో, నా పార్టనర్ షివాన్ సగం ఇండియన్. అందుకే ఆమెతో నాకు పుట్టిన కొడుకుల్లో ఒకరికి ‘శేఖర్’ అనే మిడిల్ నేమ్ పెట్టాం” అని మస్క్ ఆనందంగా చెప్పారు. ఈ పేరు ఎవరిదో కాదు, భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన ప్రముఖ భారతీయ-అమెరికన్ శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ (Subrahmanyan Chandrasekhar)ది. ఆయనపై ఉన్న గౌరవంతోనే తన కొడుకు పేరులో ‘శేఖర్’ అని చేర్చినట్లు మస్క్ వివరించారు. సైన్స్ అన్నా, శాస్త్రవేత్తలన్నా మస్క్‌కు ఎంత అభిమానమో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.

దత్తత వెళ్లిన బిడ్డ

షివాన్ జిలిస్ నేపథ్యం గురించి కూడా మస్క్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. “షివాన్ కెనడాలో పెరిగారు. ఆమె పసిబిడ్డగా ఉన్నప్పుడే దత్తత వెళ్లారు. ఆమె బయోలాజికల్ తండ్రి (కన్నతండ్రి) బహుశా ఒక ఎక్స్ఛేంజ్ స్టూడెంట్ అయి ఉంటారని, అతను భారతీయుడేనని అనుకుంటున్నాను” అని మస్క్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియకపోయినా, ఆమె మూలాలు మాత్రం ఇండియాలోనే ఉన్నాయని స్పష్టం చేశారు.

ఎవరీ షివాన్ జిలిస్?

షివాన్ జిలిస్ సాధారణ మహిళ కాదు. ఆమె యేల్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్, ఫిలాసఫీలో డిగ్రీ పొందారు. 2017లో మస్క్ స్థాపించిన ఏఐ (AI) కంపెనీ ‘న్యూరాలింక్’ (Neuralink)లో చేరారు. ప్రస్తుతం అక్కడ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ స్పెషల్ ప్రాజెక్ట్స్ హోదాలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మస్క్, షివాన్ జంటకు నలుగురు పిల్లలు ఉన్నారు. కవలలైన స్ట్రైడర్, అజూర్, కూతురు ఆర్కాడియా, కొడుకు సెల్డన్ లైకుర్గస్ (ఇతని పేరే శేఖర్ అయి ఉండొచ్చు) ఉన్నారు.

భారతీయులే అమెరికా బలం

ఈ సందర్భంగా మస్క్ భారతీయుల ప్రతిభను ఆకాశానికెత్తేశారు. “అమెరికా పురోగతిలో భారతీయ టాలెంట్ పాత్ర అమోఘం. ఇక్కడికి వచ్చిన భారతీయుల వల్ల అమెరికా ఎంతో లబ్ది పొందింది” అని ప్రశంసించారు. అయితే, ప్రస్తుతం వీసా ఆంక్షలు, పాలసీల వల్ల ఆ పరిస్థితి మారుతోందని, భారతీయ నిపుణులకు అమెరికా కల కష్టమవుతోందని పరోక్షంగా ఆవేదన వ్యక్తం చేశారు.

ALSO READ: OpenChat: మస్క్ ఆఫర్‌నే కాదన్నారు.. 22 ఏళ్ల కుర్రాళ్ళ సంచలనం.. ఓపెన్ ఏఐని మించిన ‘నెక్స్ట్ జెన్’ టెక్నాలజీ ఇదే!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News