Zohran Mamdani News: భారతదేశానికి చెందిన తల్లిదండ్రులకు ఉగాండాలో జన్మించిన వ్యక్తి జోహ్రాన్ మమ్దానీ. అమెరికాలో వ్యాపారవేత్తగా ఉన్న ఆయన ప్రస్తుతం న్యూయార్క్ నగర మేయర్ స్థానానికి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తనదైన శైలిలో తాను వస్తే ప్రజలకు కలిగే ప్రయోజనాల గురించి విభిన్నంగా ప్రచారం చేస్తూ, వీడియోలతో సోషల్ మీడియాలో వైరల్ అయిన జోహ్రాన్ మరోసారి ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచారు.
అయితే జోహ్రోన్ పేరు మళ్లీ వైరల్ కావటానికి ఈసారి కారణం ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కావటం విశేషం. ఈ ఏడాది జనవరిలో ట్రంప్ పార్టీ అయిన రిపబ్లికెన్స్ కోసం ఎన్నికల్లో క్యాంపెయిన్ చేయటంతో పాటు భారీగా ఫండింగ్ కూడా చేశాడు. అయితే ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే మస్క్ ట్రంప్ మధ్య సంబంధాలు పాడవటం, విబేధాలు రావటం తెలిసిందే. ఈ క్రమంలో అసలు తానే మరో కొత్త రాజకీయ పార్టీ పెడతానని చెప్పిన సంగతి తెలిసిందే.
అయితే ప్రస్తుతం న్యూయార్క్ మేయర్ స్థానానికి పోటీదారుగా ఉన్న జోహ్రాన్ మహ్దనీపై మస్క్ ప్రశంసల వర్షం కురిపించాడు. జోహ్రానే డెమోక్రాటిక్ పార్టీ భవిష్యత్తు అంటూ మస్క్ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో భారీ చర్చకు తెరలేపాయి. ఎన్నికల ర్యాలీలో గవర్నర్ మద్దతు వీడియోపై మస్క్ స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అమెరికా తిరిగి తమ చేతుల్లోకి రావాలంటే జోహ్రాన్ విజయం తప్పదని ర్యాలీలో గవర్నర్ కేథీ చెప్పారు.
ఇదంతా చూస్తుంటే మస్క్ ఈసారి డెమోక్రాట్ పార్టీకి పరోక్షంగా మద్ధతును ఇస్తున్నారా.. వచ్చే ఎన్నికల్లో ఆ దిశగా తన అడుగులు ఉంటాయా అనే చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల బరిలో డెమోక్రాటిక్ అభ్యర్థి మమ్దానీకి పోటీగా.. రిపబ్లికన్ పార్టీ నుంచి కర్టిస్ స్లివా.. స్వతంత్ర అభ్యర్థి ఆండ్రూ క్యూమో ఉన్నారు.
మమ్దానీ కొన్ని రోజుల కిందట 9/11 ఉగ్రదాడి గురించి మాట్లాడుతూ న్యాయార్క్ నగరంలోని ముస్లింలు ఎదుర్కొన్న సవాళ్ల గురించి ప్రస్థావించటం వివాదాస్పదమైంది. తన మతం గురించి బయటపెట్టొద్దని ఇంట్లోవాళ్లు సూచించిన విషయాన్ని కూడా చెప్పారు. జేడీవాన్స్ మాత్రం ఈ వాఖ్యలను ఖండించినప్పటికీ పోరు రసవత్తరంగా మారింది. విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.


