Sunday, June 8, 2025
Homeఇంటర్నేషనల్ట్రంప్ తో మాటల యుద్ధం.. కొత్త పార్టీ పేరు ప్రకటించిన ఎలాన్ మస్క్..?

ట్రంప్ తో మాటల యుద్ధం.. కొత్త పార్టీ పేరు ప్రకటించిన ఎలాన్ మస్క్..?

అమెరికా రాజకీయ వర్గాల్లో తాజాగా మరో సంచలన సంఘటన చోటుచేసుకుంది. టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్, మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య తీవ్ర విమర్శల పరంపర నడుస్తోంది. ఇన్నాళ్లు ఒకరినొకరు పబ్లిక్‌గా పొగుడుతూ వచ్చిన ఈ ఇద్దరూ ఇప్పుడు ఒకరి పై ఒకరు.. నేరుగా విమర్శలతోనే దిగిపోయారు. ఈ గొడవకు కేంద్రబిందువైనది రిపబ్లికన్ పార్టీ ప్రవేశపెట్టిన తాజా ట్యాక్స్ బిల్లు.

- Advertisement -

ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన మస్క్, ఇది సాధారణ పౌరుడిపై భారం వేసే చట్టం, దీనిని మద్దతిచ్చేవారు ప్రజల పట్ల బాధ్యత లేని వారు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మస్క్ వ్యాఖ్యలతో అసహనానికి లోనైన ట్రంప్, “ఎలాన్ నా మిత్రుడిగా భావించేవాడిని. కానీ ఇలా తనను విమర్శించడం శోచనీయం. అవసరమైతే సరైన చర్యలు తీసుకుంటాను అంటూ పరోక్ష హెచ్చరిక జారీ చేశారు.

ఇక ఈ పరిణామాల నడుమ ఎలాన్ మస్క్ తన తాజా ట్వీట్లలో కొత్త రాజకీయ అవకాశాల గురించి సంకేతాలు ఇచ్చారు. “ఈ దేశానికి ఒక కొత్త మార్గదర్శకత్వం అవసరం ఉంది” అంటూ, రాజకీయ రంగప్రవేశంపై పరోక్షంగా వ్యాఖ్యానించారు. తనకు రాజకీయాల్లోకి రావాలా వద్దా అన్న దానిపై X (మాజీ ట్విటర్) వేదికగా ఓ పోల్ పెట్టగా, దాదాపు 80 శాతం మంది ఆయన రాజకీయాల్లోకి రావాలని ఓటేశారు. దీనితో మరో అడుగు ముందుకేసిన మస్క్, తన కొత్త రాజకీయ పార్టీకి “నోవా పాఠ్” అనే పేరు సూచిస్తూ హింట్ ఇచ్చారు.

ఇదిలా ఉంటే, మస్క్ ట్వీట్లతో ట్రంప్ స్పందించినట్లు సమాచారం. అంతేకాకుండా “మస్క్ రాజకీయాల్లోకి వచ్చి ఏమీ చేయలేడు. టెక్‌లో అతని విజయాలు పాలిటిక్స్‌లో పునరావృతం కావని త్వరలో అందరికీ తెలుస్తుంది అంటూ ట్రంప్ వర్గాలు వ్యాఖ్యానించాయి. మరోవైపు మస్క్ కూడా తాను లేకపోతే ట్రంప్ 2016 ఎన్నికల్లో గెలవలేదని వ్యాఖ్యానించడమే కాకుండా, ట్రంప్‌కు సంబంధించిన వ్యక్తిగత ఆరోపణలు కూడా బయటపెట్టారు. “ఇతడు దేశం పాలించాల్సిన వ్యక్తి కాదు. అతని సత్యాలు బయటకు రావాలి” అంటూ పదునైన వ్యాఖ్యలు చేశారు.

ఇకపోతే, ఇప్పటిదాకా టెక్నాలజీ ప్రపంచంలోనే సంచలనాలు సృష్టించిన మస్క్… ఇప్పుడు రాజకీయ రంగంలోకి అడుగుపెడతారా.. అదే జరిగితే అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంసం అయ్యింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News