Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Elon Musk: ఇదేందయ్యా సామీ.. 14వ బిడ్డకు జన్మనిచ్చిన మస్క్

Elon Musk: ఇదేందయ్యా సామీ.. 14వ బిడ్డకు జన్మనిచ్చిన మస్క్

ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్(Elon Musk) ఏకంగా 14వ బిడ్డకు తండ్రి అయ్యాడు. న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్, మస్క్ భాగస్వామ్యి అయిన శివోన్ జలిస్‌కు మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఆమె ట్వీట్‌కు మస్క్ హార్ట్ సింబల్‌తో రిప్లై ఇచ్చాడు. ఈ జంటకు ఇప్పటికే ముగ్గురు బిడ్డలు ఉన్నారు. 2021లో కవలలకు జన్మనిచ్చిన వీరు.. 2024లో మూడవ బిడ్డను కన్నారు. తాజాగా నాల్గో బిడ్డకు జన్మనిచ్చారు. ఈ బేబికి సెల్డాన్‌ లైకుర్గస్ అని పేరు పెట్టారు.

- Advertisement -

52 ఏళ్ల మస్క్ పలువురు మహిళల ద్వారా 14 మందికి తండ్రి అయ్యాడు. షివోన్ జిలిస్‌తో నలుగురు పిల్లలతో పాటు మొదటి భార్య జస్టిన్ విల్సన్‌ ద్వారా ఐదుగురు పిల్లలు ఉన్నారు. అయితే తొలి భార్య తొలి కుమారుడు 10 వారాలకే మరణించాడు. కెనడియన్ సింగర్ గ్రిమ్స్‌తో మరో ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యారు. కాగా సంతానం లేకపోతే నాగరికత కుంగిపోతుందని.. తన మాటలు రాసిపెట్టుకోవాలని గతంలో మస్క్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad