ఈ భూమిపై విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, పద్దతులు, ఆచారాలు ఉన్నయి. ప్రతి ప్రాంతానికీ, ప్రతి సమాజానికీ, తమ విశ్వాసాలకు అనుగుణంగా ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయ. కొన్ని ఆచారాలు మనకు సహజంగా అనిపించవచ్చు, అయితే కొన్ని ఆశ్చర్యాన్ని కలిగించేవి కూడా ఉంటాయి. కొన్ని పద్దతులు మన మనోభావాలను స్పర్శిస్తే, మరికొన్ని విభిన్న దృక్పథాలను అనుసరించి విశేషంగా కనిపిస్తాయి. ప్రపంచం నలుమూలల లోని అలాంటి విచిత్రమైన, ఆసక్తికరమైన ఆచారాలను తెలుసుకుందాం. ఈ కథనంలో ఓ వింత పద్ధతి గురించి మనం తెలుసుకుందాం.
ప్రపంచం కంటే 8 సంవత్సరాలు వెనుకబడిన దేశం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా. ఈ దేశంలో ఉపయోగించే క్యాలెండర్ లో 12 కాదు 13 నెలలు ఉన్నాయి. ఇంతకీ ఈ దేశం పేరేంటి అని ఆలోచిస్తున్నారా. నిజానికి ఇది టైమ్ మెషిన్ లా అనిపిస్తుంది. సినిమాల్లో చూపించిన విధంగా. కాలంలో వెనక్కి, ముందుకు వెళ్లినట్లు భావన కలుగుతుంది. అయితే ఇక్కడ మాత్రం ఆ పని చేయాల్సిన పని లేదు.
ఆ దేశం పేరు ఇథియోపియా. ఈ దేశంలో 12 కాదు 13 నెలలు ఉంటాయి. ఇథియోపియా దేశం 8 సంవత్సరాలు వెనుకబడింది. ఇక్కడ ఉపయోగించే క్యాలెండర్ ఇతర దేశాల్లో ఉన్న గ్రెగోరియన్ క్యాలెండర్ కంటే భిన్నంగా ఉంటుంది. ఇథియోపియన్ క్యాలెండర్ లో 12 నెలలు కాకుండా 13 నెలలు ఉంటాయి. ప్రస్తుతానికి మనం 2025లో ఉంటే, ఇథియోపియాలో 2017వ సంవత్సరం. ఇక్కడ క్యాలెండర్ ప్రకారం 12 నెలలు 30 రోజులు ఉంటాయి, 13వ నెలలో మిగిలిన రోజులు ఉంటాయి.
ఇథియోపియా సాంప్రదాయ క్యాలెండర్ కారణంగా ఇతర దేశాల నుండి ఇక్కడికి వచ్చే ప్రజలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. వారి క్యాలెండర్ చూసి షాక్ అవుతారు. టైమ్ ట్రావెల్ చేసి వెనక్కి వెళ్లిపోయామా అని అనుకుంటారు.