కొత్త సంవత్సరం వేళ అగ్రరాజ్యం అమెరికా(America) ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ దేశ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్(Donald Trump)నకు చెందిన ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ వద్ద పేలుడు సంభవించింది. లాగ్‌వెగాస్‌లోని ఆ హోటల్ బయట పార్క్ చేసిన టెస్లా సైబర్‌ట్రక్‌లో ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో ఒకరు మృతి చెందగా.. మరో ఏడుగురికి గాయాలు అయ్యాయని సమాచారం. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
సమాచారంం అందుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఘటనపై టెస్లా సీఈవో, ట్రంప్ సన్నిహితులు ఎలాన్ మస్క్(Elon Musk) ఎక్స్ వేదికగా స్పందించారు. దీనిపై సీనియర్ అధికారుల బృందం దర్యాప్తు చేస్తోందన్నారు. తమకు ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే తెలియజేస్తామని ట్వీట్ చేశారు.