అమెరికా(America)లోని రొనాల్డ్ రీగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం(Plane Crash) లో ఇప్పటికి 19 మందికి మృతదేహలు బయటపడ్డాయి. ఈ విమానంలో ప్రయాణిస్తున్న 60 మంది బతికే అవకాశమే లేదని అధికారులు చెబుతున్నారు.
విమాన శకలాలు పడిన పోటోమాక్ నదిలో ఉష్ణోగ్రత-1 నుంచి -2 సెల్సియస్ మధ్య ఉందన్నారు. ఈ ఉష్ణోగ్రతకు మనుషులు ఎవరు 30- నుంచి 90 నిమిషాలకు మించి జీవించలేరని నిపుణులు చెబుతున్నారు.
ప్రమాదంపై స్పందించిన ట్రంప్
మరో వైపు ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఈ ప్రమాద ఘటనకు మానవ తప్పిదమే ప్రధాన కారణమని అన్నారు. కంట్రోల్ టవర్ సిబ్బంది నిర్లక్ష్యంగానే ఈ ఘోరం జరిగిందన్నారు. హెలికాప్టర్ సిబ్బందిని ముందే అలర్ట్ చేసి ఉంటే ఈ ఘోరం నుంచి బయటపడే అవకాశం ఉండేదన్నారు.
ల్యాండ్ అవుతుండగా
ఓ విమానం విమానాశ్రయంలో ల్యాండ్ అవుతూ గాల్లోనే ఓ ఆర్మీ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. దీంతో పెద్ద శబ్దంతో రెండూ పేలిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.