Homeఇంటర్నేషనల్JD Vance's: అమెరికాలో కాల్పుల కలకలం.. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఇంటిపై దుండగుడి దాడి

JD Vance’s: అమెరికాలో కాల్పుల కలకలం.. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఇంటిపై దుండగుడి దాడి

Fire at America Vice President JD Vance’s home: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఇంటిపై కాల్పులు జరగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఒహియోలోని సిన్సినాటిలో ఉన్న జేడీ వాన్స్‌ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తి సోమవారం తెల్లవారుజామున దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, సీక్రెట్ సర్వీస్ అధికారులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. యూఎస్ స్థానిక కాలమానం ప్రకారం, సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత (సుమారు 12:15 గంటలకు) ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తి అమెరికా ఉపాధ్యక్షుడి ఇంటి దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతూ, కిటికీలపై దాడులు చేస్తున్నట్లు అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు గుర్తించారు. భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో ఆ వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో, స్థానిక పోలీసుల సాయంతో భద్రతా దళాలు అతడిని వెంబడించి పట్టుకున్నాయి. నిందితుడు ఇంటిపై కాల్పులు జరిపినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్లనే కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయని తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని అధికారులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

- Advertisement -

జేడీ వాన్స్‌ ఇంట్లో లేకపోవడంతో తప్పిన ప్రమాదం..

అదృష్టవశాత్తూ, ఈ దాడి జరిగిన సమయంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ ఇంట్లో లేరు. సెలవులపై గత వారం ఇంటికి వచ్చిన వాన్స్, ఆదివారం మధ్యాహ్నమే వాషింగ్టన్ డీసీకి బయలుదేరి వెళ్లారు. ఆయన వెళ్లిన కొన్ని గంటల్లోనే ఈ దాడి జరగడం గమనార్హం. సాధారణంగా వాన్స్ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ప్రాంతమంతా ఫుల్ సెక్యురిటీ ఉంటుంది. ఆయన వెళ్లిన తర్వాత బారికేడ్లను తొలగించిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. ఆ వ్యక్తి ఎందుకు దాడి చేశాడు? ఎందుకు దాడి చేశాడు? దాడి వెనుక ఎవరి హస్తం ఉంది? అన్న కోణంలో సిన్సినాటి పోలీసులు, ఎఫ్‌బీఐ అధికారులు విచారణ జరుపుతున్నాయి. ఉపాధ్యక్షుడి భార్య ఉషా చిలుకూరి వాన్స్‌పై గతంలో జాత్యహంకార దాడి జరిగింది. ఈ నేపథ్యంలో, దాడి వెనుక ఏదైనా విద్వేషపూరిత కోణం ఉందా అనేది కూడా పరిశీలిస్తున్నారు. కాగా, దాడ అనంతరం వాన్స్ నివాసం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత, అమెరికాలో కీలక నేతల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ తరుణంలోనే దాడి జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికాలో పెరుగుతున్న గన్ కల్చర్‌కి ఇది నిదర్శనంగా చెప్పవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News