Sunday, January 18, 2026
Homeఇంటర్నేషనల్Bondi Beach: ఆస్ట్రేలియా బీచ్‌లో కాల్పుల ఘటన.. దుండగుడిపై తిరగబడిన పౌరుడు.. వీడియో.!

Bondi Beach: ఆస్ట్రేలియా బీచ్‌లో కాల్పుల ఘటన.. దుండగుడిపై తిరగబడిన పౌరుడు.. వీడియో.!

Australia Bondi Beach Firing: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో బాండీ బీచ్‌లో పర్యాటకులపై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన సంఘటన కలకలం సృష్టించింది. ఆస్ట్రేలియా మీడియా నివేదికల ప్రకారం ఈ ఘటనలో 11 మంది మృతి చెందినట్లు సమాచారం. కాగా, ఈ సంఘటనకి సంబంధించి ఓ సాహసోపేతమైన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో వైరల్‌ అవుతోంది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/nitin-nabin-appointed-as-bjp-national-working-president/

ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం ఈరోజు సాయంత్రం 6:30 గంటల సమయంలో బాండీ బీచ్‌లో పర్యాటకులు ఉల్లాసంగా గడుపుతున్నారు. ఈ సమయంలో బీచ్‌లోకి రైఫిల్‌తో ప్రవేశించిన నల్లటి ముసుగు ధరించిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా కాల్పులు మొదలుపెట్టారు. దీంతో వందలమంది పర్యాటకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. సర్ఫ్‌ క్లబ్‌ పక్కనే ఉన్న పాదచారుల వంతెనపైకి దుండగులు షాట్‌గన్స్‌తో కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష్య సాక్షులు తెలిపారు. 

రంగంలోకి దిగిన సిడ్నీ భద్రతా దళాలు బీచ్‌లో సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్లు, అంబులెన్సుల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. కాగా, బాండి బీచ్‌లో యూదులు జరుపుకొంటున్న ఓ ఈవెంట్‌ను లక్ష్యంగా చేసుకుని దుండగులు దాడులు జరిపినట్లు సమాచారం. నిందితుల్లో ఒకరిని పోలీసులు గుర్తించారు. నిందితుడు నవీద్‌ అక్రమ్‌(24)ని అదుపులోకి తీసుకుని వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు.  

Also Read: https://teluguprabha.net/telangana-news/woman-won-the-sarpanch-election-by-just-one-vote-in-vikarabad-district/

కాగా, కాల్పుల సమయంలో ఓ సాహసోపేతమైన సంఘటన కెమెరాలో రికార్డయింది. దుండగులు కాల్పులు జరుపుతున్న సమయంలో ఓ స్థానికుడు ముష్కరుడిని వెనుక నుంచి వెళ్లి బలంగా పట్టుకుని అతని చేతిలోని రైఫిల్‌ను లాక్కున్నాడు. అనంతరం అతడికి రైఫిల్‌ను గురిపెట్టి తరిమికొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. కాల్పుల ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News