Wednesday, November 6, 2024
Homeఇంటర్నేషనల్America Elections: అమెరికా కాంగ్రెస్‌కు తొలి ట్రాన్స్‌జెండర్ ఎన్నిక

America Elections: అమెరికా కాంగ్రెస్‌కు తొలి ట్రాన్స్‌జెండర్ ఎన్నిక

America Elections| అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు. మేజిక్ ఫిగర్ 272 ఓట్లకు మరో 20 ఓట్ల దూరంలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో డెలవేర్‌లోని ఎట్‌ లార్జ్‌ హౌస్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి డెమోక్రటిక్‌ అభ్యర్థి సారా మెక్‌బ్రైడ్‌ (Sarah McBride) విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండర్‌గా సారా గుర్తింపు తెచ్చుకున్నారు.

- Advertisement -

రిపబ్లికన్‌ పార్టీ నుంచి జాన్‌ వేలెన్‌ 3, డెమోక్రటిక్ పార్టీ నుంచి సారా మెక్‌బ్రైడ్ పోటీపడ్డారు. అయితే పోలింగ్‌లో సారాకు 95శాతం ఓట్లు పోలవగా.. వేలెన్‌కు 57.9 శాతం ఓట్లు పోలయ్యాయి. దీంతో సారా ఘన విజయం సాధించినట్లైంది. గెలుపు అనంతరం సారా మాట్లాడుతూ తాను కాంగ్రెస్‌లో చరిత్ర సృష్టించడానికి పోటీ పడలేదని డెలవేర్‌లో మార్పు కోసమే పోటీ చేసినట్లు తెలిపారు.

కాగా 2016లో డెమోక్రటిక్‌ నేషనల్‌ కన్వెన్షన్‌లో ఒక ప్రధాన పార్టీ నిర్వహించిన సమావేశంలో ప్రసంగించిన మొదటి ట్రాన్స్‌జెండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. 2020లో డెలవేర్‌లో తొలి ట్రాన్స్‌ స్టేట్‌ సెనెటర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం ఆ దేశంలో ఎల్‌జీబీటీక్యూ(LGBTQ) జాతీయ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో దాదాపు 3 మిలియన్లకుపైగా ప్రచార విరాళాలు సేకరించారు. ఇదిలా ఉంటే మరికాసేపట్లో అగ్రరాజ్యం అధ్యక్షులు ఎవరో అధికారికంగా తేలిపోనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News