IAF: భారత వైమానిక దళం చీఫ్ ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ కీలక ప్రకటన చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలను కూల్చినట్లు ప్రకటించారు. పక్కా ప్రణాళికతో 80-90 నిమిషాల వ్యవధిలో ఆపరేషన్ ని నిర్వహించి లక్ష్యాలను సాధించామన్నారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో చేసిన దాడిలో ఎఫ్-16 హ్యాంగర్ సగానికి పైగా దెబ్బతింది. ఇది పాక్ ప్రధాన ఎయిర్ ఫీల్డ్ లలో ఒకటైన షహబాజ్ జకోబాబాద్ స్థావరంలో ఉంది. అదే ప్రాంతాల్లో కొన్ని యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని అంచనాకు వచ్చామని తెలిపారు. ఆపరేషన్ సమయంలో ఎస్-400 క్షిపణి వ్యవస్థ, గగనతల రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేశాయని ఎయిర్ చీఫ్ మార్షల్ వివరించారు.
Read more: https://teluguprabha.net/international-news/trump-india-trade-talks-dispute/
ఈ ఆపరేషన్‌లో 300 కి.మీ. దూరంలో ఉన్న పాకిస్తాన్ విమానాలను కూల్చివేసినట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ సింగ్ వెల్లడించారు. భోలారీ వైమానిక స్థావరంలో దాడులు, మురిద్కేలోని లష్కర్-ఎ-తోయిబా ప్రధాన కార్యాలయంపై, బహవల్పూర్‌లోని జైష్-ఎ-మొహమ్మద్ ప్రధాన కార్యాలయంపై దాడులు జరిగాయి. ఈ దాడులలో పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయినట్లు ఏపీ సింగ్ తెలిపారు. అలాగే దాడికి ముందు తీసిన చిత్రాలను, తరువాత తీసిన చిత్రాలను పరిశీలించగా నష్టం జరిగినట్టు స్పష్టంగా తెలుస్తుంది.
Read more: https://teluguprabha.net/international-news/trump-putin-meeting-zelenskyy-precondition/
ఆపరేషన్ సిందూర్ సమయంలో యుద్ధ విమానాల కూల్చివేతపై ఏపీ సింగ్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ రక్షణ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఏపీ సింగ్ వ్యాఖ్యలు నమ్మేలా లేవని, భారత్ చేసిన దాడిలో ఒక్క విమానం కూడా దెబ్బతినలేదని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. యుద్ధం జరిగిన సమయంలోనే అన్ని వివరాలు అంతర్జాతీయ మీడియాకు ప్రకటించామని పాక్ రక్షణ మంత్రి పేర్కొన్నారు.


