Flight Services Cancelled: పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా గల్ఫ్ దేశాల్లో గగనతలాన్ని మూసివేశారు. మొత్తంగా 10 దేశాల్లో ఎయిర్‌స్పేస్ మూసివేయడంతో విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో భారత్ నుంచి అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
మధ్యప్రాచ్య దేశాల్లో యుద్ధ వాతావరణం నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో గగనతలం మూసివేశారు. మొత్తం 10 దేశాల్లో విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇరాన్, ఇరాక్, బెహ్రయిన్, ఇజ్రాయెల్, జోర్డాన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, UAE దేశాల్లోనూ విమానాలు నిలిచిపోయాయి. దీంతో భారత్ నుంచి అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లేందుకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/vijay-rashmika-couple-house-warming-in-nagarkurnool-district/
గల్ఫ్ దేశాల్లో విమానాల రద్దుతో భారత్ నుంచి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఖజెకిస్తాన్, ఉక్రెయిన్ మీదుగా విమానాలను నడుపుతున్నారు. దీన్ని ఆసరగా చేసుకుని అంతర్జాతీయ విమానయాన ఛార్జీలను సదరు ఎయిర్‌లైన్స్ సంస్థలు విపరీతంగా పెంచుతున్నాయి. దీంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, యుద్ధ మేఘాల నేపథ్యంలో ఆదివారం ఒక్కరోజే గల్ఫ్‌లోని 7 ప్రధాన విమానాశ్రయాల్లో సుమారు 3,400 విమానాలు రద్దయ్యాయి. దుబాయ్, అబుదాబి, దోహా, కువైట్ విమానాశ్రయాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

