Homeఇంటర్నేషనల్Terrorism : కాక్‌పిట్‌ టెర్రర్‌.. ఫ్లైదుబాయ్ కోపైలట్‌కు అల్ ఖైదాతో లింకులు

Terrorism : కాక్‌పిట్‌ టెర్రర్‌.. ఫ్లైదుబాయ్ కోపైలట్‌కు అల్ ఖైదాతో లింకులు

Flydubai cockpit attack Smit Machchhar : ఆకాశంలో వేల అడుగుల ఎత్తున రక్తం చిమ్మింది.. రెప్పపాటులో పెను ముప్పు ముంచుకొచ్చింది దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు 174 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఫ్లైదుబాయ్ (FZ1073) విమానంలో అనూహ్య భయోత్పాతం చోటుచేసుకుంది. అయితే, ఆ ఉన్మాది పన్నిన మృత్యువ్యూహం గాల్లోనే ఎలా ఛిన్నాభిన్నమైంది? ఆ క్షణంలో ఏం జరిగింది.

- Advertisement -

ఉగ్ర కుట్ర – తీవ్ర దాడి: ఒమన్‌కు చెందిన కోపైలట్ హమామ్ అల్హమామి కత్తి/యాక్స్‌తో భారత సంతతికి చెందిన ప్రధాన పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై విచక్షణారహితంగా దాడి చేసి, విమానాన్ని ఏకంగా వేల అడుగుల కిందికి ‘నోస్ డైవ్’ చేయించాడు.

రక్తమోడుతున్నా తిరుగులేని ధైర్యం: ప్రాణాపాయ స్థితిలోనూ కెప్టెన్ స్మిత్ మచ్చర్ చాకచక్యంగా కాక్‌పిట్ తలుపులు తెరవడంతో, లోపలికి ప్రవేశించిన ప్రయాణికులు, ఇతర సిబ్బంది ఆ ఉన్మాదిని బంధించారు. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్‌లో సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేశారు.

తీవ్రవాద భావజాలం: నిందితుడు అల్హమామి అల్-ఖైదా భావజాలానికి లోనయ్యాడని, తీవ్రవాద కనెక్షన్ల కారణంగా 2024లోనే అతడిని ఒమన్ ఎయిర్ విమానాలు నడపకుండా నిషేధించిందని అమెరికా మీడియా పరిశోధనల్లో వెల్లడైంది.

ఈ విమాన ప్రమాద కుట్రను ప్రాణాలకు తెగించి భగ్నం చేసిన కెప్టెన్ స్మిత్ అసాధారణ సాహసాన్ని ఇజ్రాయెల్, అమెరికా సహా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కొనియాడారు. ‘రియల్ హీరో’గా నిలిచిన స్మిత్ ప్రస్తుతం అబూధాబీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News