HomeTop StoriesGreat Immigrants: సత్తా చాటిన ప్రవాస భారతీయులు.. అమెరికా గ్రేట్ ఇమిగ్రెంట్ జాబితాలో నలుగురికి చోటు

Great Immigrants: సత్తా చాటిన ప్రవాస భారతీయులు.. అమెరికా గ్రేట్ ఇమిగ్రెంట్ జాబితాలో నలుగురికి చోటు

Four Indian-Americans featured in Great Immigrants list: అమెరికాలో ప్రవాస భారతీయులు సత్తా చాటారు. ప్రతిష్ఠాత్మక ‘గ్రేట్‌ ఇమిగ్రెంట్స్‌’ జాబితాలో నలుగురు భారతీయ చోటు దక్కించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డ 25 మందిని ఈ ఏడాది అగ్రరాజ్యం గొప్ప వలసదారులుగా గుర్తించింది. భారత మూలాలున్న హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ ప్రొఫెసర్‌ డా.సంజీవ్‌ చోప్రా, వెర్టెక్స్‌ ఫార్మాస్యూటికల్స్ ప్రెసిడింట్ రేష్మ కెవల్రామణి, పాలో ఆల్టో నెట్‌వర్క్స్ ఛైర్మన్ని నికేష్ అరోరా, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సామాజిక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మహరీన్‌ బనాజీలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అమెరికా అభివృద్ధి కోసం వారు అందించిన సేవలకు గానూ ఈ అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్‌కు చెందిన కార్నెగీ కార్పొరేషన్‌ ఏటా గ్రేట్‌ ఇమిగ్రెంట్స్‌ జాబితాను విడుదల చేస్తుంది. ఈ ఏడాది కూడా ఇలా నలుగురు గ్రేట్‌ ఇమిగ్రెంట్స్‌ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

- Advertisement -

Also Read: Akhil Raj: ముదురుతున్న డెలివరి బాయ్‌ వివాదం.. హీరో అఖిల్‌ కారుపై దాడి

దీపావళి పేరుతో పోస్టల్ స్టాంప్‌ విడుదల..

ఇదిలా ఉంటే, అమెరికాలో మన దీపావళి పండుగకు అత్యంత ప్రాధాన్యత దక్కింది. పోస్టల్‌ సర్వీస్‌ (యూఎస్‌పీఎస్‌) ఈ ఏడాది విడుదల చేసే స్టాంపుల్లో దీపావళి పండగకు స్థానం కల్పించింది. హ్యూస్టన్‌కు చెందిన భారతీయ మూలాలు గల కళాకారిణి సంగీత భూటాడా రూపొందించిన అందమైన రంగోలిని ఈ స్టాంపుపై ముద్రించారు. భారతీయ సంస్కృతికి గౌరవ సూచకంగా దీపావళి స్టాంపును అధికారికంగా విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News