Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్POK Azadi: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో స్వాతంత్య్ర నినాదాలు.. మెుదలైన ప్రజా ఉద్యమం..

POK Azadi: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో స్వాతంత్య్ర నినాదాలు.. మెుదలైన ప్రజా ఉద్యమం..

Pakistan-occupied Kashmir: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ఇటీవల భారీ ప్రజా ఉద్యమం ఊపందుకుంది. ప్రధానంగా అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో వేలాది మంది పౌరులు రోడ్లపైకి వచ్చి, పాకిస్తాన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక రాజకీయ, ఆర్థిక సమస్యలు, స్థానికుల హక్కులపై ప్రభుత్వం ఖర్చు చేయకపోవటం, పశ్చాత్తాపం లేకుండా పరిపాలన జరగడం వంటి కారణాలతో విద్యుత్‌, తిండి వంటి అవసర వస్తువులపై సబ్సిడీలు కల్పించాలని, అలాగే చట్టసభలో స్థానిక ప్రజలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్లతో AAC 38 పాయింట్ల డిమాండు పత్రాన్ని ప్రభుత్వానికి సమర్పించింది.

- Advertisement -

పీవోకేలో సుదీర్ఘకాలంగా స్థానిక ప్రజలకు ప్రాథమిక హక్కులు, ప్రాతినిధ్య పాలన లేకపోవడం ప్రస్తుత నిరసనలకు దారితీసింది. అసెంబ్లీలో కాశ్మీరీ శరణార్థుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన 12 స్థానాలను రద్దు చేయాలని AAC డిమాండ్ చేస్తోంది. ఇలా చేయడం ద్వారా స్థానికుల ప్రాతినిధ్యాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్, ఆహార పదార్ధాల ధరలు పెరిగినా ప్రభుత్వం పట్టించుకోకపోవటం.. అవినీతి, పరిపాలనా లోపాలు కూడా నిరసనలకు ప్రేరణగా మారాయి. దీనికి మునుపు 2022, 2023లో ఇలాంటి ఉద్యమాలు జరుగగా.. ఈసారి అవి ఉధృతంగా మారటంతో ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పాకిస్తాన్ ప్రభుత్వం 1,000 మందికి పైగా పోలీసుల్ని, పంజాబ్ రేంజర్లతో పాటు, భారీ భద్రత బలగాల్ని పీవోకేలో మోహరించింది. అలాగే ప్రజా ఉద్యమాన్ని అణచివేయడానికి ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం, ప్రధాన పట్టణాల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు ముమ్మరం చేసింది పాక్. కానీ పీవోకే ప్రాంతంలోని ప్రజల గొంతు నుంచి ఆజాదీ నినానాదాలు మారుమోగటం ప్రభుత్వానికి నిద్రలేకుండా చేస్తోంది.

అక్కడి ప్రజలు స్థానికంగా మాత్రమే కాకుండా అమెరికా, యుకే, యూరప్ దేశాల్లో కూడా అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు. దీంతో “పాకిస్తాన్ నుండి స్వాతంత్య్రం” కోసం గొంతు కలిపేవారి సంఖ్య పెరుగుతోంది. ఇదే కొనసాగితే అక్కడ భారీ వ్యవస్థాపక, రాజకీయ మార్పులకు దారితీయవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad