West Africa: ఘనాలో ఘోరమైన హెలికాప్టర్ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం దేశ వ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో దేశానికి సంబంధించిన కీలక నాయకులు ఉన్నారు. ఇది ఘనా రక్షణ శాఖ చరిత్రలో ఒక తీవ్రమైన సంఘటనగా నిలిచింది.
ఆగస్టు 6 ఉదయం, Z-9 యుటిలిటీ ఘానా ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్, అగ్ర రాజధాని అక్రా నుంచి ఒబువాసి నగరానికి ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణంలో హెలికాప్టర్ రాడార్ సిగ్నల్స్ అందలేదు. ఇది జరిగిన కొద్ది సేపటిలోనే హెలికాప్టర్ అశాంతి ప్రాంతంలోని అడాన్సి అక్రోఫుమ్ జిల్లాలో కూలిపోయింది. హెలికాప్టర్ భయంకరంగా పేలిపోయి పూర్తిగా దగ్ధమైంది.
Read more: https://teluguprabha.net/international-news/france-battles-largest-wildfire-burns-vineyards/
ఈ ప్రమాదంలో రక్షణ మంత్రి డాక్టర్ ఎడ్వర్డ్ ఒమానే బోమా, పర్యావరణ, విజ్ఞానం, సాంకేతికత, నవ ఆవిష్కరణల మంత్రి ఇబ్రహీం ముర్తాలా ముహమ్మద్, డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ మునీరు మహమ్మద్, ఇతర ప్రముఖ అధికారులు, పైలట్లు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
ఘనా ప్రెసిడెంట్ జాన్ డ్రామాని మహామా, ఈ ఘటనను జాతీయ విషాదంగా ప్రకటించారు. ప్రభుత్వం మూడు రోజులు జాతీయ విషాదాన్ని ప్రకటించింది. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను తాత్కాలికంగా రద్దు చేసింది. దేశ జాతీయ పతాకాలు అర్ధస్థాయిలో ఉంచబడ్డాయి. ప్రస్తుతం ఆర్ధిక మంత్రి కాసియెల్ ఆటో ఫోర్సన్ ని తాత్కాలిక రక్షణ మంత్రిగా నియమించారు.
ఈ ఘటనపై ECOWAS, ఆఫ్రికా యూనియన్, ఇతర దేశాధినేతలు ఘన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి విచారిస్తూ.. బాధితులకు అండగా ఉంటామని తెలిపారు.


