Tuesday, September 17, 2024
Homeఇంటర్నేషనల్Goa: 'ఇది మోడీ ఇండియా' కాదంటున్న ఫ్రెంచ్ యాక్టర్

Goa: ‘ఇది మోడీ ఇండియా’ కాదంటున్న ఫ్రెంచ్ యాక్టర్

పలు ఫ్రెంచ్, ఇంగ్లీష్ సినిమాల్లో నటించిన యాక్టర్ మరియాన్ బోర్గో తీవ్ర నిరాశ, నిస్పృహలతో తాను ఇండియా విడిచి వెళ్లిపోతున్నట్టు ట్వీట్ చేసి సెన్సేషన్ సృష్టిస్తున్నారు. 75 ఏళ్ల బోర్గో తాను నిండా మునిగిపోయినట్టు, గోవాలో మోసపోయినట్టు, తీవ్ర మనోవేదనతో ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్లిపోతున్నట్టు ట్వీట్ చేశారు. ఇంత జరుగుతున్నా గోవా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం నుంచి తనకు మాట సాయం కూడా దక్కలేదంటూ ఆమె తన ఆవేదనను వెళ్లగక్కారు. ప్రపంచ వేదికలపై భారత్ ను పర్యాటక రాజధాని చేస్తామంటూ మోడీ బీరాలు పలుకుతారని ఇక్కడ చూస్తే ఇది పరిస్థితి అంటూ ఆమె వాపోవటం ఆలోచింప చేసే విషయంగా సోషల్ మీడియాలో మారింది.

- Advertisement -

2008లో గోవాలోని కలాంగోట్ బీచ్ లో ఫ్రాన్సిస్కో సౌజా అనే లాయర్ కు చెందిన విశాలమైన భవంతిని బోర్గో కొనుగోలు చేశారు. కానీ కోవిడ్ టైంలో లాయర్ ఫ్రాన్సిస్కో మరణించాడు. ఆతరువాత తనకు కష్టాలు మొదలయ్యాయని, ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని లాయర్ కుటుంబీకులు తనపై నానాయాగీ చేస్తున్నారని ఆమె చెబుతున్నారు. 11 రోజుల క్రితం, తన ఇంటి గేటును మూసేసి, కరెంటు, మంచి నీరు కనెక్షన్ కట్ చేసి నానా కష్టాల్లోకి తనను నెట్టి, ఇల్లును స్వాధీనం చేసుకునే ప్రయత్నాలను లాయర్ భార్య చేస్తున్నారని బోర్గో తెలిపారు. అంతేకాదు తనను తన ఇంట్లోనే బందీని చేసేసి, ఆస్తి లాక్కునేలా జిమ్మిక్కులు ప్రయోగించారని చెప్పుకొచ్చారు. ఇలాంటి చోట్ల తాను ఇంకా స్నానం చేయకుండా, చీకట్లో అనారోగ్యంతో మగ్గలేనని ఇక ఇండియాకు గుడ్ బై కొట్టేస్తున్నట్టు బోర్గో వివరించారు. అయితే విషయం కోర్టులో ఉన్నందున తాము కల్పించుకోలేమని స్థానిక పోలీసులు చేతులెత్తేయటం విశేషం.

ది బోర్న్ ఐడెంటిటీ, ఎ లిటిల్ ప్రిన్సెస్ వంటి సినిమాల్లో పనిచేసి బోర్గో ప్రస్తుతం ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News