Saturday, July 12, 2025
Homeఇంటర్నేషనల్Golden Urn Clash: దలైలామా వారసత్వంపై రగడ!

Golden Urn Clash: దలైలామా వారసత్వంపై రగడ!

China’s Firm Grip on Dalai Lama Successor : “అతను లేని లోకం, నేను లేని నేను” అన్నట్టు.. దలైలామా వారసత్వంపై ఇప్పుడు ప్రపంచం దృష్టి నిలిచింది. ఒక పక్క టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా, మరోపక్క ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్న చైనా.. ఈ ఇద్దరి మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు అగ్నిగుండంగా మారింది. దలైలామా వారసుడి ఎంపిక విషయంలో చైనా కఠిన వైఖరి అవలంబిస్తుండగా, దలైలామా మాత్రం తన ట్రస్ట్‌కే అధికారం కట్టబెట్టారు. ఈ పరిణామాలు టిబెట్ భవిష్యత్తును ఏ తీరాలకు చేర్చుతాయోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అసలు ‘గోల్డెన్ అర్న్’ పద్ధతి ఏమిటి? దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి? ఈ వివాదం ఎటువైపు దారితీస్తుంది.? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే, ఈ వివరాలు చూడాల్సిందే!

- Advertisement -

చైనా పట్టు: మా ఆమోదం లేకుండా వారసుడు ఎవరూ లేరు : జూలై 2, 2025న, దలైలామా వారసుడి ఎంపికపై తన అధికారాన్ని పునరుద్ఘాటించిన కొద్దిసేపటి తర్వాత, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “దలైలామా వారసుడి ఎంపిక కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి లోబడి ఉండాలి. 18వ శతాబ్దంలో క్వింగ్ రాజవంశం ప్రవేశపెట్టిన ‘గోల్డెన్ అర్న్’ పద్ధతిని తప్పనిసరిగా అనుసరించాలి” అని ఆమె స్పష్టం చేశారు. ఈ పద్ధతి ప్రకారం, దలైలామా వారసుడిని ఒక బంగారు పాత్ర (గోల్డెన్ అర్న్) నుంచి చీటీలు తీయడం ద్వారా ఎంపిక చేసి, ఆ తర్వాత చైనా ప్రభుత్వ ఆమోదం పొందాలి. ఇది చైనా పట్టుదలకు నిదర్శనం.

చైనా చట్టాలు, చరిత్ర – కఠిన నిబంధనలు :  చైనా, 2007లోనే ‘గోల్డెన్ అర్న్’ పద్ధతిని చట్టబద్ధం చేసింది. దీని ప్రకారం, దలైలామా వారసుడి ఎంపిక ప్రక్రియలో విదేశీ వ్యక్తులు లేదా సంస్థల జోక్యాన్ని పూర్తిగా నిషేధించారు. 14వ దలైలామా ఎంపిక కూడా ఈ సంప్రదాయాలకు అనుగుణంగానే జరిగిందని, అయితే అప్పటి కేంద్ర ప్రభుత్వం ‘గోల్డెన్ అర్న్’ నుంచి మినహాయింపు ఇచ్చిందని మావో నింగ్ పేర్కొన్నారు. అయితే, చైనా విదేశాంగ శాఖ అధికారిక వెబ్‌సైట్ ట్రాన్స్‌క్రిప్ట్‌లో ఈ వ్యాఖ్యలు లేకపోవడం గమనార్హం. ఇది చైనా వైఖరిలో ఒకరకమైన గోప్యతను సూచిస్తుంది.

దలైలామా వ్యూహం: ట్రస్ట్‌కే సంపూర్ణ అధికారం : దలైలామా, తన 90వ పుట్టినరోజుకు (జూలై 6) ముందస్తుగా సోషల్ మీడియాలో ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. “15వ దలైలామా ఎంపిక కొనసాగుతుంది, దీనికి ‘గాడెన్ ఫోడ్రోంగ్ ట్రస్ట్’ మాత్రమే అధికారం కలిగి ఉంటుంది. ఎవరూ జోక్యం చేసుకోలేరు” అని ఆయన స్పష్టం చేశారు. 2015లో ఏర్పాటు చేయబడిన ఈ ట్రస్ట్, 2011లో టిబెట్ మతపెద్దలు, నాయకులతో సమావేశమై వారసుడి ఎంపికపై సానుకూల అభిప్రాయాలను సేకరించింది. ఈ ప్రకటన దలైలామా తన వారసుడి ఎంపికను చైనా ప్రభావం నుంచి దూరంగా ఉంచడానికి చేస్తున్న ప్రయత్నాలను వెల్లడిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

చైనా వర్సెస్ టిబెట్: ఆధిపత్య పోరు : చైనా, దలైలామాను “విభజనవాది”గా పరిగణించి, తన కనుసన్నల్లో ఉండే ఒక కీలుబొమ్మను వారసుడిగా నియమించాలని చూస్తోంది. అయితే, దలైలామా మాత్రం తన వారసుడు చైనా వెలుపల నుంచే నియమాకం చేయనున్నట్లు స్పష్టం చేశారు. భారత్‌లోని చైనా రాయబారి సూఫెహాంగ్ సైతం, ఈ పునర్జన్మ ఆచారం 700 సంవత్సరాల నుంచి కొనసాగుతోందని, చైనా చట్టాలకు అనుగుణంగా నిర్వహించాలని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News