Golden Visa Procedure: విదేశాల్లో స్థిరపడాలనేది చాలామంది కల. విద్యా లేదా ఉద్యోగ అవకాశాలతో విదేశాలకు వెళ్లి అక్కడే సెటిల్ కావడం సాధ్యపడుతుంది. కానీ అందరికీ ఈ అవకాశం దక్కదు. అలాంటి వారి కోసం కొన్ని దేశాలు “గోల్డెన్ వీసా” పేరుతో ప్రత్యేక ప్రవాస నిబంధనలు అమలు చేస్తున్నాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే వాళ్లకు రిసిడెన్స్ పర్మిట్ లేదా పౌరసత్వం కల్పించే ఈ విధానం, ఖరీదైనదైనా శాశ్వత నివాసానికి మార్గం.
గోల్డెన్ వీసా ద్వారా లభించే లాభాలు:
వీసా లేకుండా పలు దేశాలకు ప్రయాణించే అవకాశం
కుటుంబ సభ్యులతో పాటు తల్లిదండ్రులకు కూడా వీసా వర్తింపు
పన్నుల భారం తగ్గించే అవకాశం (కొన్ని దేశాల్లో)
స్థిర నివాసం కలిగి, నిర్ణీత కాలం తర్వాత పౌరసత్వం పొందే అవకాశం
ఉత్తమమైన జీవన ప్రమాణాలు, వైద్య సదుపాయాలు, విద్యావకాశాలు
కొన్నిచోట్ల మాతృదేశంలోనే ఉండి, పౌరసత్వం పొందే వీలూ ఉంది
గోల్డెన్ వీసా ఇచ్చే 9 దేశాలు – ఖర్చుతో సహా వివరాలు:
1. లాత్వియా
పెట్టుబడి: €60,000 (సుమారు ₹60 లక్షలు)
లాభాలు: లాత్వియాలో 5 ఏళ్ల నివాసం, వీసా ఫ్రీ షెంగెన్ ప్రయాణాలు
2. మాల్టా
ఖర్చు: €1,82,000 (అంటే ₹1.8 కోట్లు దాటే వ్యయం)
ప్రయోజనాలు: నివాసం, పౌరసత్వానికి మార్గం, యూరోపియన్ యూనియన్ ప్రయోజనాలు
3. గ్రీస్
పెట్టుబడి: €250,000 (దాదాపు ₹2.5 కోట్లు)
లాభాలు: రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడికి 5 ఏళ్ల రెసిడెన్స్, యూరోప్ టూరిజం సౌలభ్యం
4. హంగేరి
ఖర్చు: €250,000(సుమారు రెండున్నర కోట్లు)
ప్రత్యేకత: గెస్ట్ ఇన్వెస్టర్ ప్రోగ్రాం ద్వారా వేగంగా వీసా ప్రాసెసింగ్ (6 వారాల్లో), ఈయూ ప్రయాణ సౌలభ్యం
5. ఇటలీ
పెట్టుబడి: €250,000(సుమారు రెండున్నర కోట్లు) స్టార్టప్‌లలో
వీసా కాలం: 10 ఏళ్ల రెసిడెన్స్, తర్వాత పౌరసత్వం పొందే అవకాశం
6. వనౌటు
ఖర్చు: $130,000 (సుమారు ₹1.1 కోట్లు)
ప్రయోజనాలు: 130 దేశాలకు వీసా లేకుండా ప్రయాణం, వేగవంతమైన వీసా ఆమోదం (1-2 నెలల్లో)
7. డొమినికా
ఖర్చు: $200,000 (₹1.7 కోట్లు)
లాభాలు: డొమినికా పౌరసత్వం, 140 దేశాలకు వీసా ఫ్రీ ఎంట్రీ
8. ఆంటిగ్వా & బార్బుడా
పెట్టుబడి: $230,000 (₹2 కోట్లు)
ప్రయోజనం: నివాసంతో పాటు పౌరసత్వ హక్కు పొందే అవకాశం
9. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)
ఖర్చు: AED 2 మిలియన్ (₹4.7 కోట్లు)
లాభాలు: జీవితకాల రెసిడెన్స్, పన్ను మినహాయింపు, నిపుణుల కోసం ప్రత్యేక గోల్డెన్ వీసా (AED 100,000 / ₹23 లక్షలు)
గోల్డెన్ వీసా విధానం ద్వారా సరైన పెట్టుబడి, ప్రణాళిక ఉంటే విదేశాల్లో స్థిర నివాసం కల్పించుకోవచ్చు. దీని ద్వారా మంచి జీవన ప్రమాణాలు, గ్లోబల్ ప్రయాణ సౌలభ్యం లభిస్తాయి. అయితే, ప్రతీ దేశానికి భిన్నమైన నిబంధనలు ఉండటంతో ముందుగా పరిశీలన చేసుకోవడం ఉత్తమం. అలాగే సరైన సలహా తీసుకోవడం అవసరం.

