Wednesday, January 14, 2026
Homeఇంటర్నేషనల్Trump Vs Denmark: అమెరికాకు డెన్మార్క్ వార్నింగ్.. గ్రీన్‌లాండ్‌ జోలికొస్తే తగ్గేదేలే అంటోండి..

Trump Vs Denmark: అమెరికాకు డెన్మార్క్ వార్నింగ్.. గ్రీన్‌లాండ్‌ జోలికొస్తే తగ్గేదేలే అంటోండి..

Greenland Standoff: అగ్రరాజ్యం అమెరికా చూపు ఇప్పుడు ఆర్కిటిక్ ప్రాంతంలోని అతిపెద్ద ద్వీపం గ్రీన్‌లాండ్‌ పై పడింది. ఎలాగైనా ఈ ప్రాంతాన్ని దక్కించుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్టుబట్టడం.. దానికి డెన్మార్క్ ససేమిరా అనడంతో ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం ముదిరి చివరకు సైనిక చర్యల హెచ్చరికల వరకు వెళ్లింది.

- Advertisement -

అమెరికా వ్యూహం ఏమిటి..?
గ్రీన్‌లాండ్‌ వ్యూహాత్మకంగా అమెరికా జాతీయ భద్రతకు అత్యంత కీలకమని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనాల ప్రాబల్యాన్ని తగ్గించడానికి ఈ ప్రాంతంపై పట్టు సాధించడం అవసరమని ట్రంప్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అవసరమైతే సైనిక శక్తిని ఉపయోగించడానికైనా సిద్ధంగా ఉన్నట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ప్రకటించడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం డెన్మార్క్ రక్షణ తీరును విమర్శిస్తూ.. తమ ప్రయోజనాల కోసం ఎంతవరకైనా వెళ్తామని హెచ్చరించారు.

also read Medaram Jatara: ఆదివాసీల కుంభమేళా.. వీర వనితల వీరగాథ!

డెన్మార్క్ సంచలన నిర్ణయం:
అమెరికా హెచ్చరికలపై డెన్మార్క్ రక్షణ మంత్రిత్వ శాఖ అత్యంత కఠినంగా స్పందించింది. ఒకవేళ అమెరికా గ్రీన్‌లాండ్‌పై దాడికి దిగితే.. ఉన్నతాధికారుల ఆదేశాల కోసం వేచి చూడకుండా ముందు కాల్పులు జరపండి.. ఆ తర్వాతే ప్రశ్నలు అడగండి అంటూ తమ సైనికులకు స్పష్టమైన దూకుడు ఆదేశాలు జారీ చేసింది.

చారిత్రక నిబంధన:
1940లో నాజీ జర్మనీ డెన్మార్క్‌పై దాడి చేసిన సమయంలో కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నందున.. 1952లో ఈ ‘రూల్ ఆఫ్ ఎంగేజ్‌మెంట్’ను రూపొందించారు. విదేశీ శత్రువులు దాడి చేస్తే అనుమతి లేకుండానే ఎదురుదాడి చేయాలనే ఈ నిబంధన నేటికీ అమల్లోనే ఉందని డెన్మార్క్ స్పష్టం చేస్తూ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది.

గ్రీన్‌లాండ్‌ అమ్మకానికి లేదని డెన్మార్క్ పదేపదే చెప్తున్నా.. ట్రంప్ మాత్రం తన పంతం వీడకపోవటంతో వివాదం ముదురుతోంది. మరోవైపు ఐరోపా దేశాల నేతలు కూడా అమెరికా తీరును తప్పుబడుతున్నారు. ఒక నాటో మిత్రదేశంపైనే అమెరికా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశమైంది. అగ్రరాజ్యం దూకుడుకు డెన్మార్క్ దీటుగా జవాబిస్తుండటంతో ఆర్కిటిక్ ప్రాంతంలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. అయితే ఇది కూడా మరో వెనిజులా లాంటి పరిస్థితికి దారితీస్తుందా అనే అంశం ప్రస్తుతానికి వేచి చూడాల్సిన విషయంగా మారింది. ఈ ప్రభావం మాత్రం ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది ట్రంప్ దూకుడు తర్వాత.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News