Gun Fire in America 3 Died: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. నార్త్ కరోలినా రాష్ట్రంలోని ఓ రెస్టారెంట్ వద్దకు వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి తన దగ్గర ఉన్న తుపాకితో కాల్పులు మొదలుపెట్టాడు. ఈ దాడిలో స్పాట్‌లోనే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.. మరికొందరు గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సౌత్‌పోర్ట్ యాచ్ బేసిన్ సమీపంలోని అమెరికన్ ఫిష్ కంపెనీ రెస్టారెంట్‌లో శనివారం రాత్రి కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. సడెన్‌గా ఒక బోట్‌లో అక్కడికి చేరుకున్న గుర్తుతెలియని వ్యక్తి.. తన దగ్గర ఉన్న తుపాకీతో రెస్టారెంట్‌లోని వ్యక్తులను టార్గెట్‌గా చేసుకోని కాల్పులు జరిపాడని.. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడని పేర్కొన్నారు.
దుండగుడి కాల్పుల్లో రెస్టారెంట్‌లో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. మరికొందరికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/pawan-kalyan-og-ticket-prices-decrease-in-telugu-staes/
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు.


