Sunday, January 5, 2025
Homeఇంటర్నేషనల్America: వణుకుతున్న అమెరికా.. తాజాగా కాల్పుల కలకలం

America: వణుకుతున్న అమెరికా.. తాజాగా కాల్పుల కలకలం

కొత్త సంవత్సరం వేళ అగ్రరాజ్యం అమెరికా(America) వరుస ఘటనలతో వణికిపోతోంది. ఒకదాని తర్వాత ఒక దుర్ఘటన జరుగుతూ ఉండటంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తొలుత న్యూఆర్లీన్స్‌లోని షాపింగ్ కాంప్లెక్స్‌లో ప్రజలపైకి ఓ ఉన్మాది వాహనం ఎక్కించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరింది. తర్వాత ఆ దేశ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump)నకు చెందిన ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ వద్ద పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు గాయపడ్డారు.

- Advertisement -

ఈ రెండు ఘటనలు మరువకముందే తాజాగా కాల్పులు(Gun Firing) చోటు చేసుకున్నాయి. న్యూయార్క్‌లోని క్వీన్స్‌ కౌంటీకి చెందిన అమజురా నైట్‌క్లబ్‌లో ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారని స్థానిక పోలీసులు తెలిపారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. కాల్పులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వరుస ఘటనలతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News