Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్H-1B Visa Row: H-1B వీసా.. $100,000 ఫీజుపై ట్రంప్ సర్కార్ కీలక ప్రకటన.. భారతీయులకు...

H-1B Visa Row: H-1B వీసా.. $100,000 ఫీజుపై ట్రంప్ సర్కార్ కీలక ప్రకటన.. భారతీయులకు భారీ ఊరట!

Trump Administration Clarifies $100,000 Fee Exemptions: అమెరికాలో H-1B వీసాపై ఆధారపడిన వేలాది మంది భారతీయులకు, ముఖ్యంగా విద్యార్థులకు భారీ ఊరట లభించింది. H-1B ప్రోగ్రామ్‌పై ట్రంప్ యంత్రాంగం గత నెలలో విధించిన వివాదాస్పద $100,000 (లక్ష డాలర్లు) ఫీజు విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరదించుతూ US సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.

- Advertisement -

గత నెల సెప్టెంబర్ 19న ట్రంప్ సర్కార్ జారీ చేసిన ఈ “లక్ష డాలర్ల” ఫీజు ప్రకటన.. కంపెనీలను, వీసాదారులను తీవ్ర అయోమయానికి గురిచేసింది. ఎవరికి ఇది వర్తిస్తుంది, ఎవరికి వర్తించదనే దానిపై స్పష్టత కొరవడింది. తాజా మార్గదర్శకాలతో ఆ అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు.

ALSO READ: Netanyahu: భారత పర్యటనకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతం..!

విద్యార్థులకు, ఉద్యోగులకు గుడ్‌న్యూస్!

USCIS తాజా ప్రకటన ప్రకారం, ఈ భారీ ఫీజు ఇప్పటికే అమెరికాలో ఉన్నవారికి వర్తించదు. ముఖ్యంగా, F-1 (విద్యార్థి) వీసాపై చదువు పూర్తి చేసుకుని, H-1B స్పాన్సర్‌షిప్ పొందిన వారికి ఈ ఫీజు నుండి మినహాయింపు లభిస్తుంది. అదేవిధంగా, L-1 (ఇంట్రా-కంపెనీ బదిలీ) వీసాపై పనిచేస్తూ, H-1Bకి మారాలనుకునే ఉద్యోగులకు కూడా ఈ $100,000 ఫీజు వర్తించదు.

దేశం విడిచి వెళ్లకుండానే ఒక వీసా కేటగిరీ నుండి మరో కేటగిరీకి మారే ప్రక్రియను “ఛేంజ్ ఆఫ్ స్టేటస్” (Change of Status) అంటారు. ఇలాంటి దరఖాస్తులకు, లేదా ఇప్పటికే H-1Bపై ఉండి వీసా పొడిగింపు (Extension) కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఈ ఫీజు భారం ఉండదని ఏజెన్సీ స్పష్టం చేసింది. ఇది అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించి, ఉద్యోగాలు వెతుక్కుంటున్న వేలాది మంది భారతీయ విద్యార్థులకు అతిపెద్ద శుభవార్త.

ALSO READ: Australia AP Agriculture : ఏపీ వ్యవసాయానికి ఆస్ట్రేలియా సహకారం.. వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీతో నారా లోకేశ్ చర్చలు

మరి ఈ ఫీజు ఎవరికి వర్తిస్తుంది?

ఈ ఫీజు ప్రధానంగా అమెరికా వెలుపల ఉండి, కొత్తగా H-1B వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని USCIS తేల్చి చెప్పింది. “సెప్టెంబర్ 21, 2025 తర్వాత, అమెరికా బయట ఉండి, చెల్లుబాటు అయ్యే H-1B వీసా లేని వారి తరపున దాఖలు చేసే కొత్త పిటిషన్లకు ఈ ప్రకటన వర్తిస్తుంది,” అని ఏజెన్సీ పేర్కొంది.

టెక్ రంగం H-1B ప్రోగ్రామ్‌ను దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలతో ట్రంప్ సర్కార్ ఈ కఠినమైన ఫీజును ప్రవేశపెట్టింది. అయితే, ఇది అమెరికాలోని అనేక పరిశ్రమలను దెబ్బతీస్తుందని, నిపుణుల కొరతను సృష్టిస్తుందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తాజా స్పష్టతతో, అమెరికాలోనే ఉండి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనుకునే వారికి మార్గం సుగమమైంది.

ALSO READ: Paul Ingrassia Viral comments : “భారతీయుడిని ఎప్పటికీ నమ్మెద్దు” – ట్రంప్ నామినీ వివాదాస్పద చాట్ లీక్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad