Tuesday, September 10, 2024
Homeఇంటర్నేషనల్Hamas: ఆరుగురు ఇజ్రాయెల్-అమెరికన్ బందీల హ‌తం

Hamas: ఆరుగురు ఇజ్రాయెల్-అమెరికన్ బందీల హ‌తం

జెరూసలేం: గాజాలో హమాస్ ఉగ్రవాదులు ఆరుగురు ఇజ్రాయెల్-అమెరికన్ బందీలను హతమార్చారు. వారందరి మృతదేహాలను ఇజ్రాయెల్ సైన్యం స్వాధీనం చేసుకుంది. ఇజ్రాయెల్-అమెరికన్ యువకుడు హెర్ష్ గోల్డ్‌బెర్గ్-పోలిన్ తల్లిదండ్రులు తమ కొడుకును గాజా స్ట్రిప్‌లో బందీలుగా పట్టుకున్న ఉగ్రవాదులు హత్య చేశారని ధృవీకరించారు. 23 ఏళ్ల గోల్డ్‌బెర్గ్-పోలిన్ విడుదల కోసం తల్లిదండ్రులు చేసిన ప్రచారాన్ని ముగించారు. దీనికి స్పందించిన అమెరికా అధ్య‌క్షుడు జోబైడెన్ మాట్లాడుతూ ఇందుకు హమాస్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. గత సంవత్సరం, హమాస్ ఉగ్రవాదులు దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఒక సంగీత కార్య‌క్ర‌మంపై దాడి చేసి గోల్డ్‌బెర్గ్-పోలిన్‌తో పాటు మరికొందరిని బందీలుగా పట్టుకున్నారు. కాలిఫోర్నియాలోని బర్కిలీ నివాసి గోల్డ్‌బెర్గ్-పోలిన్ గ్రెనేడ్ దాడిలో ఎడమ చేతిని కోల్పోయాడు. ఏప్రిల్‌లో హమాస్ విడుదల చేసిన వీడియోలో అతను తన ఎడమ చేతిని కోల్పోయాడని, చాలా నొప్పితో బాధ‌ప‌డుతూ మాట్లాడుతున్నట్లు చూపించారు. దీంతో బందీలను విడుదల చేయాలంటూ ఇజ్రాయెల్‌లో నిరసనలు చెలరేగాయి.

- Advertisement -

గోల్డ్‌బెర్గ్-పోలిన్‌తో సహా ఆరుగురు బందీల హత్య చేశాక‌, మిగిలిన బందీలను స్వదేశానికి సురక్షితంగా తీసుకువ‌చ్చేలా చేయడానికి రాజీకి రావాలని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అమెరికా ఒత్తిడిని పెంచవ‌చ్చ‌ని భావిస్తున్నారు. బందీలను వెనక్కి తీసుకురావడానికి సైనిక చర్య అవసరమని నెతన్యాహు భావిస్తున్నారు. గోల్డ్‌బెర్గ్-పోలిన్ తల్లిదండ్రులను కలిసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ తాను ఈ ఘ‌ట‌న‌పై విచారంగా, కోపంగా ఉన్నానని అన్నారు. ఈ నేరాలకు హమాస్ నేత‌లు త‌గిన‌ మూల్యం చెల్లించుకోవలసి వ‌స్తుంది. మిగిలిన బందీల విడుదల కోసం మేము నిరంత‌రం ప్ర‌య‌త్నిస్తున్నామ‌న్నారు.

గాజా స్ట్రిప్‌లోని సొరంగంలో బందీలుగా ఉన్నఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయని, మృతులను గుర్తించామని ఇజ్రాయెల్ దళాలు ప్రకటించాయి. ఆ తర్వాత గోల్డ్‌బెర్గ్-పోలిన్ కుటుంబం కుమారుని మరణాన్ని ధృవీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ దుఃఖ సమయంలో తమ‌ గోప్యతను గౌరవించాలని అభ్యర్థిస్తున్నామ‌ని వారు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News