“Hitler Of Our Time”: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చేదు అనుభవం ఎదురైంది. వాషింగ్టన్ డీసీలోని ఓ రెస్టారెంట్‌లో భోజనం చేస్తుండగా, పాలస్తీనాకు మద్దతిచ్చే నిరసనకారులు ఆయన్ని అడ్డుకున్నారు. నిరసనకారులు ట్రంప్‌ను ‘మన కాలపు హిట్లర్’ (Hitler of our time) అంటూ నినాదాలు చేశారు.
While Trump, JD Vance, Marco Rubio, Pete Hegseth and others feasted at a steakhouse, we stood our ground and told them the truth: Free DC. Free Palestine. Trump is the Hitler of our time.
Two years into genocide, Gaza is under evacuation orders, Puerto Rico and Venezuela are in… pic.twitter.com/546qb1s1MO
— CODEPINK (@codepink) September 10, 2025
వైట్ హౌస్‌కు సమీపంలో ఉన్న జోస్ సీఫుడ్, ప్రైమ్ స్టీక్ అండ్ స్టోన్ క్రాబ్ అనే రెస్టారెంట్‌లో ట్రంప్ తన క్యాబినెట్ సభ్యులతో కలిసి డిన్నర్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో నిరసనకారులు “ఫ్రీ డీసీ”, “ఫ్రీ పాలస్తీనా” అంటూ పెద్దగా నినాదాలు చేశారు. నిరసనకారులను చూసి ట్రంప్ నవ్వి, తల ఊపారు. ఆ తర్వాత వారిని బయటకు పంపించమని సైగ చేశారు. అక్కడున్న మిగతా కస్టమర్లు నిరసనకారులను వ్యతిరేకిస్తూ అరిచారు. తర్వాత, వారిని రెస్టారెంట్ నుంచి బయటకు పంపించారని సిఎన్ఎన్ నివేదించింది.
ఈ నిరసనకు తామే బాధ్యత వహిస్తున్నామని కోడ్ పింక్ అనే ఫెమినిస్ట్ యాక్టివిస్ట్ గ్రూప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. “ట్రంప్, జేడీ వాన్స్, మార్కో రూబియో, పీట్ హెగ్సెత్ వంటి వారు స్టీక్ హౌస్‌లో విందు చేసుకుంటుండగా, మేము అక్కడికి వెళ్లి వారికి నిజం చెప్పాం. డీసీని, పాలస్తీనాను విడిచిపెట్టండి. ట్రంప్ మన కాలపు హిట్లర్” అని ఆ పోస్ట్‌లో పేర్కొంది.
డీసీ ఇకపై సేఫ్..
ట్రంప్ ఇటీవలే వాషింగ్టన్ డీసీలో నేషనల్ గార్డ్‌ను మోహరించారు. ఆ తర్వాత “ఇప్పుడు మన రాజధాని దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా మారిపోయింది” అని చెప్పుకున్నారు. దీనిపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఇప్పుడు నగరంలో ఎవరైనా హాయిగా బయట తిరగవచ్చని, రాత్రిపూట కూడా భోజనానికి వెళ్లి ధైర్యంగా ఇంటికి వెళ్లవచ్చని చెప్పారు. “ఇంటికి వెళ్లేటప్పుడు ఎవరూ మిమ్మల్ని దోచుకోరు” అని కూడా హామీ ఇచ్చారు. అయితే, ఆయన ఇలా చెప్పిన కొద్దిసేపటికే ఈ నిరసన ఘటన జరగడం విశేషం. ట్రంప్ మాటలకు, వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న తేడాను ఈ ఘటన స్పష్టంగా చూపించింది.
ALSO READ: Nepal Crisis: నేపాల్ సంక్షోభం.. సైన్యంతో చర్చలకు మాజీ సీజే సుశీలా కర్కీ.. యువత సంచలన నిర్ణయం!


