Homeఇంటర్నేషనల్Romance Scam: పగలు 'కోటీశ్వరుడు'.. రాత్రి 'బిచ్చగాడు'! 10 రోజుల్లో ఐదుగురు అమ్మాయిలకు వల.. అసలు...

Romance Scam: పగలు ‘కోటీశ్వరుడు’.. రాత్రి ‘బిచ్చగాడు’! 10 రోజుల్లో ఐదుగురు అమ్మాయిలకు వల.. అసలు కథ తెలిస్తే షాక్!

Homeless Chinese Man Pretends To Be Rich, Scams 5 Women: పైకి కనిపించే ఆడంబరాలను చూసి మోసపోకూడదని పెద్దలు ఊరకనే అనలేదు. చైనాలోని షాంఘైలో జరిగిన ఒక సంఘటన దీనికి పక్కా ఉదాహరణ. ఉండటానికి ఇల్లు లేక పార్కుల్లో పడుకునే ఒక వ్యక్తి, తనను తాను పెద్ద కోటీశ్వరుడిలా (Chinese Man Pretends To Be Rich) బిల్డప్ ఇచ్చుకుని ఏకంగా ఐదుగురు మహిళలను బురిడీ కొట్టించాడు. కేవలం 10 రోజుల వ్యవధిలో, నకిలీ నోట్లను చూపిస్తూ ఈ కేటుగాడు ఆ మహిళల డబ్బుతో విలాసవంతమైన జీవితం (Luxury Lifestyle) అనుభవించాడు. చివరికి ఒక బాధితురాలి ఫిర్యాదుతో ఈ బాగోతం బయటపడింది.

- Advertisement -

ALSO READ: Elon Musk: ‘నా పార్ట్‌నర్‌కి భారతీయ మూలాలు.. కొడుకు పేరులో శేఖర్!’.. మస్క్ నోట ఆసక్తికర విషయాలు

నైట్ క్లబ్ ఓనర్ అవతారం

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆగస్టు నెలలో షాంఘైకి చెందిన లియు కియాన్ అనే మహిళ పోలీసులను ఆశ్రయించింది. చెన్ (36) అనే వ్యక్తి తనను తాను నైట్ క్లబ్ యజమానిగా పరిచయం చేసుకున్నాడని చెప్పింది. అతడి మాటలు నమ్మిన ఆమె, అతడితో కలిసి షాపింగ్ కు, ఖరీదైన హోటల్స్ కు వెళ్లింది. అయితే, బిల్లులు మాత్రం ఆమే కట్టింది. “త్వరలో నీకు భారీగా డబ్బు ఇస్తాను, నిన్ను జాబ్‌లోకి తీసుకుంటాను” అని చెన్ ఆమెను నమ్మించాడు.

ALSO READ: Mass Shooting US: ఫ్యామిలీ పార్టీలో కాల్పుల మోత.. నలుగురు మృతి, చిన్నారులతో సహా 10 మందికి గాయాలు!

నల్ల ప్లాస్టిక్ కవర్.. వాస్తు సెంటిమెంట్

మరుసటి రోజు ఉదయం లియు ఇంటికి వచ్చిన చెన్, ఆమె చేతిలో ఒక నల్లటి ప్లాస్టిక్ కవర్ పెట్టాడు. అందులో కట్టల కొద్దీ డబ్బు కనిపించింది (సుమారు 60 వేల యువాన్లు). “వాస్తు ప్రకారం ఈ డబ్బు కొన్నాళ్లు నీ మంచం కింద ఉండాలి, అస్సలు కదిలించవద్దు” అని ఆమెకు చెప్పి బయటకు వెళ్లాడు. ఆ రోజు లియు ఇంటి అద్దె కట్టాల్సి ఉంది. చేతిలో డబ్బు లేకపోవడంతో, చెన్ ఇచ్చిన బ్యాగ్ లోంచి కొంత తీసుకుందామని ఆమె బ్యాగ్ తెరిచింది. అంతే, ఆమె గుండె ఆగినంత పనైంది. ఆ నోట్ల కట్టల్లో పైన, కింద మాత్రమే నిజమైన నోట్లు ఉన్నాయి. మధ్యలో ఉన్నవన్నీ బ్యాంకు సిబ్బంది లెక్కించడం నేర్చుకోవడానికి వాడే ‘ట్రైనింగ్ బ్యాంక్ నోట్లు’ (నకిలీ కాగితాలు).

పగలు రాజా.. రాత్రికి పేద

బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు చెన్‌ను అరెస్టు చేశారు. దర్యాప్తులో విస్తుపోయే నిజాలు తెలిశాయి. చెన్‌కు అసలు ఇల్లే లేదు. జేబులో డబ్బులు అయిపోతే రాత్రిపూట పబ్లిక్ పార్కుల్లోని బెంచీలపై పడుకునేవాడు. ఉదయం లేవగానే ఆన్‌లైన్ చాట్ గ్రూపుల్లో తాను పెద్ద ఏజెంట్ అని, అమ్మాయిలకు ఎక్కువ డబ్బు వచ్చే పనులు ఇప్పిస్తానని మెసేజ్‌లు పెట్టేవాడు. అలా అమ్మాయిలు వలలో పడగానే, ఈ నకిలీ నోట్ల కట్టలు చూపించి తాను పెద్ద ధనవంతుడిని అని నమ్మించేవాడు.

మహిళల డబ్బుతో జల్సాలు

ఆ నోట్ల కట్టలు చూసి నిజమే అనుకున్న మహిళలు.. అతడి ఖర్చులన్నీ భరించేవారు. హోటల్ బిల్లులు, టాక్సీ ఖర్చులు, చివరికి అతను వేసుకున్న కొత్త బట్టలు, వాడుతున్న స్మార్ట్‌ఫోన్ కూడా ఆ అమాయక మహిళలు కొనిచ్చినవే. ఇలా ఒకరి తర్వాత ఒకరిని పట్టుకుని, వారి డబ్బుతో పది రోజుల పాటు జల్సా చేశాడు. ఒకవేళ కొత్త బకరా దొరక్కపోతే, ఆ రోజు పార్కులో పడుకునేవాడు. ఈ కిలాడీని పోలీసులు అరెస్టు చేయడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు.

ALSO READ: UN Warns Pakistan: పాకిస్థాన్ రాజ్యాంగ సవరణలపై ఐరాస సీరియస్.. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News