Sunday, September 8, 2024
Homeఇంటర్నేషనల్Imran Khan ex-wife: త‌న‌కంటే 13ఏళ్ల చిన్న‌వాడిని మూడోపెళ్లి చేసుకున్న ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య‌

Imran Khan ex-wife: త‌న‌కంటే 13ఏళ్ల చిన్న‌వాడిని మూడోపెళ్లి చేసుకున్న ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య‌

Imran Khan ex-wife: పాకిస్థాన్ మాజీ అధ్య‌క్షుడు ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహ‌మ్ ఖాన్ మూడో పెళ్లి చేసుకుంది. త‌న‌కంటే 13ఏళ్ల చిన్న‌వాడిని ఆమె శుక్ర‌వారం అమెరికాలో నిక్కా చేసుకున్నారు. ఈ మేర‌కు ట్విట‌ర్‌లో త‌న పెళ్లి వివ‌రాల‌ను వెల్ల‌డించింది. 36ఏళ్ల వ‌య‌స్సు క‌లిగిన మోడ‌ల్‌, న‌టుడు మీర్జా బిలాల్ బేగ్‌ను నేను వివాహం చేసుకున్నాన‌ని రెహ‌మ్ ఖాన్ తెలిపింది. అంతేకాదు.. అమెరికాలో మ‌త పెద్ద‌ల స‌మ‌క్షంలో మీర్జా బిలాల్ త‌ల్లిదండ్రులు, నా కొడుకు నా వ‌కీల్‌గా సియాటెల్‌లో సంతోష‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో మీర్జా, నేను పెళ్లి చేసుకోవ‌టం జ‌రిగింద‌ని ట్విట‌ర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోనుసైతం ఆమె ట్విట‌ర్ లో పోస్టు చేశారు.

- Advertisement -

రెహ‌మ్ ఖాన్ వృత్తి జ‌ర్న‌లిస్ట్. ఆమె బీసీసీలోనూ ప‌నిచేశారు. ప్ర‌స్తుతం ఆమెకు 49ఏళ్లు. 2015లో ఇమ్రాన్ ఖాన్‌ను ఆమె రెండో పెళ్లి చేసుకుంది. ఇమ్రాన్ కు రెహ‌మ్ ఖాన్ రెండో భార్య‌. వీరి వివాహ బంధం ఎక్కువ‌కాలం నిల‌వ‌లేదు. ప‌ది నెల‌ల్లోనే వారు ప‌లు విష‌యాల్లో మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో విడిపోయారు. ఆ త‌రువాత 2018లో ఇమ్రాన్ ఖాన్ బుష్రా వ‌ట్టూను మూడో వివాహం చేసుకున్నాడు. రెహ‌మ్ ఖాన్ త‌న కుమారుడితో క‌లిసి ఉంటుంది. తాజాగా మీర్జా బిలాల్‌తో ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మార‌డంతో వారి పెద్దల స‌మ‌క్షంలో పెళ్లి చేసుకున్నారు.

మోడ‌ల్‌, న‌టుడు మీర్జా బిలాల్ బేగ్ అమెరికాలో నివాస‌ముంటున్నాడు. మీర్జాకు కూడా రెహ‌మ్ ఖాన్ మూడో భార్య‌. ఈ వివాహంకు ముందు రెహ‌మ్ ట్విట‌ర్ ఖాతాలో ఆస‌క్తిక‌ర మెస్సేజ్ చేశారు. చివ‌ర‌కు నేను విశ్వ‌సించ‌గ‌ల వ్య‌క్తిని క‌నుగొన్నాను అటూ మీర్జాబిలాల్ గురించి ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News