Friday, December 12, 2025
HomeTop StoriesImran Khan: ఇమ్రాన్ ఖాన్ కుమారుడి ఆందోళన.. "మా నాన్న ప్రాణాలతో ఉన్నట్లు నిరూపించండి"

Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కుమారుడి ఆందోళన.. “మా నాన్న ప్రాణాలతో ఉన్నట్లు నిరూపించండి”

Imran Khan’s Son Demands Proof of Life, Blasts ‘Inhumane Isolation’: పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మరణించారంటూ సోషల్ మీడియాలో వదంతులు వచ్చిన నేపథ్యంలో, ఆయన కుమారుడు (Son) ఖాసిం ఖాన్ రంగంలోకి దిగాడు. గత 845 రోజులుగా జైలులో ఉన్న తన తండ్రి ఏకాంత నిర్బంధం (Solitary Confinement) ఆపాలని, ఆయన క్షేమంగా ఉన్నట్లు రుజువు చూపించాలని పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. ఈ ‘అమానవీయ ఏకాంతం’ భద్రతా నిబంధన కాదు, కేవలం ఆయన ఆరోగ్యం గురించి దాచిపెట్టే ప్రయత్నమే అని ఖాసిం ఆరోపించారు.

- Advertisement -

ALSO READ: UAE Visa Ban: పాకిస్థాన్‌కు యూఏఈ గట్టి షాక్.. భిక్షాటన, నేరాల కారణంగా వీసాల జారీ బంద్!

ఆరు వారాలుగా డెత్ సెల్‌లో ఏకాంతం

ఖాసిం ఖాన్ తన ‘X’ ఖాతాలో పోస్ట్ చేస్తూ, గత నెలన్నర రోజులుగా తన తండ్రిని రావల్పిండిలోని అదియాలా జైలులో ‘డెత్ సెల్’లో ఒంటరిగా ఉంచారని తెలిపారు. “గత ఆరు వారాలుగా, ఆయన పూర్తి ఒంటరి వాతావరణంలో ఉన్నారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ, మా అక్కాచెల్లెళ్లను కలవకుండా అడ్డుకున్నారు. ఆయనతో ఫోన్ కాల్స్ లేవు, భేటీలకు అనుమతి లేదు. ఆయన ఆరోగ్య సమాచారం మాకు తెలియదు. నేను నా సోదరుడు ఏ విధంగానూ మా నాన్నను సంప్రదించలేకపోయాం,” అని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ‘పూర్తి చీకటి’ నిర్బంధం ఏ భద్రతా ప్రోటోకాల్ భాగం కాదని, కావాలనే ఆయన పరిస్థితిని దాచిపెట్టి, కుటుంబ సభ్యులకు ఆయన గురించి తెలియకుండా చేయాలనే ఉద్దేశంతో జరుగుతున్న కుట్ర అని ఖాసిం ఆరోపించారు.

పాక్ ప్రభుత్వానికి కుమారుడి హెచ్చరిక

“నా తండ్రి భద్రతకు, ఈ అమానవీయ నిర్బంధం వల్ల కలిగే ఏ పరిణామానికైనా పాకిస్థాన్ ప్రభుత్వం, దాని అధిపతులే పూర్తి చట్టపరమైన, నైతిక, అంతర్జాతీయ బాధ్యత వహిస్తారు,” అని ఖాసిం గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం, మానవ హక్కుల సంస్థలు జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖానుమ్ కూడా ఇదే విధమైన ఆవేదన వ్యక్తం చేశారు. గత 6-7 నెలలుగా తమను కలవనీయకుండా చాలా ఇబ్బంది పెట్టారని, కోర్టు ఆదేశాలు ఉన్నా కొన్నిసార్లు లోపలికి అనుమతించకుండా గంటల తరబడి బయట వేచి ఉండేలా చేశామని ఆమె టెలిఫోన్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇమ్రాన్‌ను కలవడానికి జైలు వద్దకు వచ్చిన ఆయన సోదరీమణులపై పోలీసులు దాడి చేశారని కూడా పీటీఐ (పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్) పార్టీ ఆరోపించింది.

జైలు అధికారుల ప్రకటన, రాజకీయ విమర్శలు

అయితే, ఇమ్రాన్ ఖాన్ మరణించారనే పుకార్లపై అదియాలా జైలు అధికారులు గురువారం స్పందించారు. ఇమ్రాన్ ఖాన్ “పూర్తి ఆరోగ్యంతో” ఉన్నారని, అన్ని రకాల అవసరమైన సంరక్షణ అందిస్తున్నామని జైలు యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపింది. ఆయనను వేరే చోటుకు తరలించారనే వార్తలు పూర్తిగా నిరాధారమైనవని అధికారులు స్పష్టం చేశారు.

ఇమ్రాన్ ఖాన్‌కు జైలులో విలాసవంతమైన సౌకర్యాలు లభిస్తున్నాయని, “ఫైవ్ స్టార్ హోటళ్లలో కూడా దొరకని మంచి ఆహారం” ఆయనకు అందుతోందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుండి జైలులో ఉన్నారు. ఆయనపై నమోదైన డజన్ల కొద్దీ కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమైనవేనని పీటీఐ వాదిస్తోంది.

ఖాసిం ప్రధాన డిమాండ్లు

ఖాసిం తన తండ్రిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. నాలుగు ముఖ్యమైన డిమాండ్లను అంతర్జాతీయ సమాజం ముందు ఉంచారు:

  • నా తండ్రి సజీవంగా ఉన్నట్లు వెంటనే ధృవీకరించాలి.

  • కోర్టు ఆదేశాల ప్రకారం కుటుంబ సభ్యులకు భేటీ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలి.

  • ఈ అమానవీయ ఏకాంత నిర్బంధాన్ని వెంటనే ఆపాలి.

  • రాజకీయ కారణాల కోసం మాత్రమే జైలులో ఉన్న తమ దేశపు అత్యంత ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకుడిని వెంటనే విడుదల చేయాలి.

ALSO READ: Feral Cats న్యూజిలాండ్‌ ‘ఫెరల్ క్యాట్స్’ పై యుద్ధం: 25 లక్షల ‘రాక్షస హంతకుల’ నిర్మూలనే లక్ష్యం!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News