coastal areas: సముద్ర తీర పరిస్థితులపై ఓ అధ్యయనం సంచలన వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ మార్పుల కారణంగా సముద్ర తీరాల్లో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొంది. అయినప్పటికీ ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న చాలామంది అక్కడినుంచి వలస వెళ్లలేకపోతున్నారని ఓ అధ్యయనం పేర్కొంది. ఆఫ్రికా, ఆసియాల్లోని అల్పాదాయ దేశాల్లో పరిస్థితి ఇంకా దయనీయంగా ఉందని పేర్కొంది. చైనాకు చెందిన సిచువాన్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియాలోని మొనాష్ యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని చేపట్టగా.. దానికి సంబంధించిన రిజల్ట్స్ ఇటీవల నేచర్ క్లైమేట్ ఛేంజ్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఆ అధ్యయాన్ని చూస్తే తీర ప్రాంత ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వేరే ప్రాంతాలకు వలస వెళ్లట్లేదని నిరూపితమైంది. అయితే, వలస వెళ్లక పోవడానికి గల కారణాలపై మాత్రం ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. కాకపోతే, ఎక్కువకాలం అక్కడే ఉండటం వల్లే ఆ ప్రాంతం నుంచి వలకు మొగ్గుచూపట్లేదని తెలుస్తోంది.
Read Also: Bigg Boss Written Updates: వామ్మో.. రీతూకి డీమాన్ వెన్నుపోటు..!
పరిస్థితులు ఇవే..
ఇకపోతే, భూ ఉపరితలంపైన వచ్చిన మార్పులపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. అందుకోసం 1992-2019 మధ్య భూ ఉపరితలంపై రాత్రి వెలుగుల్లో వచ్చిన మార్పులను పరిశీలించారు. తీరంలో నివసించే వారిలో 56 శాతం మంది తీరానికి దూరంగా వచ్చేయగా 28 శాతం మంది అక్కడే ఉంటున్నారని, 16 శాతం మంది తీరానికి మరింత దగ్గరగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని తేలింది. ఆఫ్రికా, ఆసియాల్లోని అల్పాదాయ దేశాల్లో ఏకంగా 46 శాతం మంది అక్కడే ఉండటం లేదా తీరానికి మరింత దగ్గరగా జీవిస్తున్నారని అధ్యయనం పేర్కొంది. దీనికి విరుద్ధంగా దిగువ మధ్యాదాయ, ఎగువ మధ్యాదాయ దేశాల్లో తీరం నుంచి దూరంగా నివాసాలు మార్చుకునే రేటు వరుసగా 65 శాతం, 59 శాతంగా ఉంది. ధనిక దేశాల్లో అత్యంత ఖరీదైన మౌలిక వసతులు అందుబాటులో ఉన్నందున తీరప్రాంత ప్రజలు నివాసాలను మార్చుకునే ఒరవడి కాస్త తక్కువగానే ఉంది.
Read Also: UN General Assembly: నేటి నుంచే ఐక్యరాజ్యసమితి 80వ వార్షిక ప్రతినిధుల సభ సమావేశం..!
దేశంలోని పలు రాష్ట్రాలపైనా పరిశీలన
భారతదేశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పుదుచ్చేరి ప్రాంతాలనూ శాస్త్రవేత్తలు పరిశీలించారు. ‘‘పర్యావరణ మార్పులకు తగినట్లు జీవనశైలిని మార్చుకునే అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఒకేలా లేవు. ఇది ఆందోళనకరం. ధనిక, ఎగువ మధ్యాదాయ దేశాల్లో మౌలికవసతుల కల్పనతో పరిస్థితి బాగానే ఉంది. కానీ పేదరికం, నిరక్షరాస్యత కనిపించే అల్పాదాయ దేశాల్లో ప్రజలకు సముద్రానికి దూరంగా కొత్త నివాసాలను ఏర్పరచుకోవడం కష్టం’’ అని అధ్యయనకర్తలు పేర్కొన్నారు.


