Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్India-China relations: చైనాతో భారత్ మైత్రి ప్రపంచ శాంతి, ఆర్థిక స్థిరత్వానికి కీలకం

India-China relations: చైనాతో భారత్ మైత్రి ప్రపంచ శాంతి, ఆర్థిక స్థిరత్వానికి కీలకం

India-China Can Bring Stability To Global Economy: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక, రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటన నుంచి కీలక సందేశం పంపారు. చైనాతో బలమైన, స్నేహపూర్వక సంబంధాలు ప్రపంచ శాంతికి, ఆర్థిక స్థిరత్వానికి అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు సరిహద్దుల్లో శత్రువులుగా ఉన్న ఈ రెండు దేశాల మధ్య మారుతున్న వైఖరికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది.

- Advertisement -

ఈ అనూహ్య మార్పుకు ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వాణిజ్య విధానాలు. భారత ఎగుమతులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించడంతో, సుమారు $48 బిలియన్ల వాణిజ్యంపై ప్రభావం పడింది. ఇదే విధమైన ఒత్తిడిని చైనా కూడా ఎదుర్కొంటోంది. ఈ ఆర్థిక సవాలును అధిగమించేందుకు, గల్వాన్ ఘర్షణల నాటి విభేదాలను పక్కనపెట్టి, పరస్పర సహకారంతో ముందుకు సాగాలని భారత్, చైనా నిర్ణయించుకున్నాయి.

ALSO READ: India-China relations: జిన్‌పింగ్ రహస్య లేఖ.. భారత్-చైనా సంబంధాలలో అనూహ్య మలుపు!

ఈ కొత్త స్నేహానికి గుర్తుగా, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఇటీవల ఢిల్లీలో పర్యటించారు. ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి, లద్దాఖ్‌లో సైనిక బలగాల ఉపసంహరణ జరిగింది. “డ్రాగన్, ఏనుగు కలిసి నాట్యం చేయడమే సరైన మార్గం” అన్న చైనా వ్యాఖ్యలను ప్రధాని మోదీ తన ప్రసంగంలో పరోక్షంగా ప్రస్తావించారు.

ALSO READ: Modi Japan Tour: టోక్యోలో మోదీ మంత్రం..పెట్టుబడుల ప్రవాహానికి పచ్చజెండా!

జపాన్ పర్యటన ముగించుకుని, ప్రధాని మోదీ నేరుగా చైనాలోని టియాంజిన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సుకు హాజరుకానున్నారు. ఈ పర్యటనలో ఆయన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ కావడం దాదాపు ఖాయం. మారుతున్న ప్రపంచ సమీకరణాల నేపథ్యంలో, ఆసియాలోని ఈ రెండు అగ్ర దేశాలు తమ ఉమ్మడి ప్రయోజనాల కోసం చేతులు కలుపుతున్నాయనడానికి మోదీ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad