Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్India on Nepal Protests: నేపాల్‌లో భగ్గుమన్న అశాంతిపై భారత్ ఆందోళన.. పౌరులు అప్రమత్తంగా ఉండాలని...

India on Nepal Protests: నేపాల్‌లో భగ్గుమన్న అశాంతిపై భారత్ ఆందోళన.. పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచన

India Issues Statement on Nepal Protests: సరిహద్దు దేశం నేపాల్‌లో రాజుకున్న అల్లర్లు, హింసాత్మక నిరసనలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నిరసనల కారణంగా 19 మంది ప్రాణాలు కోల్పోయి, వందలాది మంది గాయపడిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. నేపాల్‌లో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

- Advertisement -

“నేపాల్‌లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాం. నిరసనల్లో ఎందరో యువత ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం” అని ఆ ప్రకటనలో పేర్కొంది.

ALSO READ: Actress Manisha Koirala on Nepal Protest: నేపాల్ హింస..మనీషా కోయిరాలా సంచలన కామెంట్స్

ఒక మంచి స్నేహితుడిగా, పొరుగు దేశంగా అన్ని వర్గాలవారు సంయమనం పాటించి, శాంతియుత మార్గాల్లో, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. కాఠ్మండుతో పాటు పలు నగరాల్లో కర్ఫ్యూ విధించినట్లు గమనించామని, నేపాల్‌లో ఉన్న భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అక్కడి స్థానిక అధికారులు ఇచ్చే సూచనలను పాటించాలని సూచించింది.

సోషల్ మీడియా నిషేధంపై నిరసనలు మళ్లీ మొదలవ్వడంతో కాఠ్మండులో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నేపాల్‌ ప్రభుత్వం సోమవారం నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ, నిరసనకారులు మంగళవారం మళ్లీ వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో కాఠ్మండు జిల్లా అధికారులు నగరంలోని రింగ్‌ రోడ్డు పరిధిలో నిరవధిక కర్ఫ్యూ విధించారు.

ALSO READ: Nepal Gen Z Protest: నేపాల్‌లో హింసాత్మకంగా మారిన ఆందోళనలు.. ఆర్థిక మంత్రిని వెంబడించి మరీ..!

ఈ ఘటనలపై ప్రధాని కేపీ శర్మ ఓలీ స్పందిస్తూ, “కొందరు స్వార్థపరుల చొరబాటు” వల్ల ఈ హింసాత్మక ఘటనలు జరిగాయని ఆరోపించారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లిస్తామని, గాయపడిన వారికి ఉచిత చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా నివారించడానికి ఒక విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసి 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

“జనరేషన్-జడ్ నిరసనలు” అని పిలవబడుతున్న ఈ ఆందోళనలు, కేవలం సోషల్ మీడియా నిషేధానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రభుత్వ అవినీతి, యువతకు ఉద్యోగ అవకాశాల లేమి వంటి సమస్యలపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని ఇది ప్రతిబింబిస్తోందని నిరసనకారులు అంటున్నారు.

ALSO READ: Nepal Crisis: అతనే తమ కొత్త ప్రధాని అంటున్న నేపాల్ కుర్రోళ్లు.. అసలు ఎవరు ఈ బాలేంద్ర షా..?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad