Indian Origin Co Pilot: డెల్టా ఎయిర్‌లైన్స్‌లో విధులు నిర్వర్తిస్తున్న కో పైలట్ రుస్తుం భగ్వాగర్ ని పోలీసులు అరెస్ట్ చేసారు. భారత సంతతికి చెందిన రుస్తుం భగ్వాగర్ ని శాన్‌ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ చేసారు. కాక్‌పిట్ నుండే పోలీసులు రుస్తుం భగ్వాగర్ ని అదుపులోకి తీసుకున్నారు. భగ్వాగర్‌పై చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి.
డెల్టా ఎయిర్ లైన్స్ కి చెందిన బోయింగ్ విమానం మిన్నియాపోలిస్ నుంచి బయల్దేరి, శాన్‌ఫ్రాన్సిస్కోలో ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన పది నిమిషాల సమయంలోనే పోలీసులు కాక్‌పిట్ లోకి దూసుకు వెళ్లారు. ఈ పరిణామంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. లోపలికి వెళ్లిన పోలీస్ సిబ్బంది కోపైలట్ భగ్వాగర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Readmore: https://teluguprabha.net/international-news/12-lakh-per-child-scheme-in-china/
ఈ ఏడాది ఏప్రిల్ నుండే భగ్వాగర్ పై విచారణ సాగుతుంది. భగ్వాగర్ చిన్న పిల్లలను లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఉన్నాయి. అతడు తప్పించుకునే అవకాశం లేకుండా అధికారులు అరెస్ట్ ప్రక్రియను గోప్యంగా నిర్వహించారు. ఓ ప్రయాణికుడు మీడియాతో భగ్వాగర్ ని వేర్వేరు సంస్థలకు చెందిన యూనిఫామ్ ధరించిన అధికారులు వచ్చి బేడీలు వేసి తీసుకెళ్లారు అని వెల్లడించాడు.
Readmore: https://teluguprabha.net/international-news/manhattan-skyscraper-shooting-nypd-officer-killed/
ఈ ఘటనతో షాక్ కి గురయిన భగ్వాగర్, అరెస్ట్ గురించి తనకు ముందుగా తెలియదని చెప్పాడు. భగ్వాగర్ అరెస్ట్ పై డెల్టా సంస్థ స్పందిస్తూ.. అనైతిక ప్రవర్తనను మా సంస్థ ఏమాత్రం సహించదు. అతడిపై వచ్చిన ఆరోపణలు మమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. మేం అతడిని సస్పెండ్ చేస్తున్నాం అని వెల్లడించింది.


