Indonesia Marriage Dowry Controversy : ప్రపంచవ్యాప్తంగా పెళ్లికి వయసు అడ్డుకోదని చెప్పుకుంటాం. కానీ, ఇండోనేసియాలో జరిగిన ఒక వివాహం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 74 ఏళ్ల వృద్ధుడు టార్మాన్, తనకంటే 50 సంవత్సరాలు చిన్న 24 ఏళ్ల యువతి షెలా అరికాతో అక్టోబర్ 1న పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి టార్మాన్ ఏకంగా 3 బిలియన్ ఇండోనేసియన్ రూపయలు (సుమారు రూ.1.8 కోట్లు లేదా 1.8 లక్షల అమెరికన్ డాలర్లు) కట్నంగా చెల్లించారు. ఈస్ట్ జావా ప్రావిన్స్‌లోని పాసిటన్ రీజెన్సీలో ఘనంగా జరిగిన ఈ వేడుక సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతిథులకు సాధారణ గిఫ్ట్‌లు ఇవ్వకుండా, ప్రతి ఒక్కరికీ సుమారు రూ.6 వేలు క్యాష్‌గా అందజేశారు. వీడియోల్లో టార్మాన్ చెక్‌ను అందించేటప్పుడు అందరూ ఉల్లాసంగా చప్పట్లు కొట్టిన సన్నివేశాలు కనిపిస్తున్నాయి.
ALSO READ: Pawan Kalyan Deepavali Wishes : దీపావళి కానుకగా పవన్ మ్యాసేజ్ – శుభాకాంక్షలతో పాటు సున్నిత హెచ్చరిక!
కానీ, ఈ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. వేడుక ముగిసిన వెంటనే నవదంపతులు అదృశ్యమయ్యారు. ఫొటోగ్రాఫీ, వీడియోగ్రాఫీ సంస్థకు చెల్లించాల్సిన డబ్బు ఇవ్వకుండా పారిపోయారని ఆరోపణలు వచ్చాయి. మొదట 1 బిలియన్ రూపయలు (రూ.60 లక్షలు) చెల్లిస్తామని చెప్పి, సంఘటన సమయంలో 3 బిలియన్‌కు పెంచారట. దీంతో సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. టార్మాన్ షెలా కుటుంబ మోటార్‌సైకిల్‌పై పారిపోయారని కూడా పేర్కొన్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ చెక్ తప్పుదోవ పడ్డదని కూడా సోషల్ మీడియాలో అందరూ చర్చిస్తున్నారు.
షెలా కుటుంబం ముందే హెచ్చరించింది. “పెళ్లి వద్దు, జాగ్రత్త” అని బంధువులు చెప్పినా, ఆమె వినలేదని ఒక బంధువు లైవ్ స్ట్రీమ్‌లో చెప్పారు. టిక్‌టాక్‌లో వీడియోలు వైరల్ అవుతుండగా, టార్మాన్ సోషల్ మీడియాలో స్పందించారు. “కట్నం నిజమే, బ్యాంక్ ఆఫ్ సెంట్రల్ ఆసియా (బీసీఏ) నుంచి వచ్చింది. నేను భార్యను వదలలేదు, మేము కలిసే ఉన్నాం” అని పోస్ట్ చేశారు. తర్వాత షెలా కుటుంబం కూడా “హనీమూన్‌కు వెళ్లాం” అని వెల్లడి చేసింది.


