Ferry fire: ఇండోనేషియాలోని తలిసే ద్వీపం వద్ద ఒక ఫెర్రీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కేఎం బార్సిలోనా వీఏ పాసింజర్ షిప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. భయాందోళనకు గురైన నౌక ప్రయాణికులు తమను తాము రక్షించుకోవాలని వెంటనే సముద్రంలో దూకేశారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ప్రమాద ఘటన తెలుసుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగారు. ఈ ప్రమాద ఘటనలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. సహాయక బృందాలు ఇప్పటి వరకు 284 మందిని కాపాడినట్లు స్థానిక డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారి జెర్రీ హార్మోన్సియా తెలిపారు.
Readmore: https://teluguprabha.net/international-news/kai-trump-net-worth-golf-nil-deals/
తలౌడ్ నుంచి ఉత్తర సులవేసి ప్రావిన్సు రాజధాని మనాడోకు కేఎం బార్సిలోనా 5 ఫెర్రీ బయలు దేరింది. తలిసే ప్రాంతానికి చేరుకున్న సమయంలో ఫెర్రీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నౌకలో భారీ స్థాయిలో మంటలు రావడంతో అక్కడ దట్టమైన పొగ వ్యాపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Readmore: https://teluguprabha.net/international-news/narendra-modi-to-visit-uk-maldives-on-official-trip/
రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు.. స్థానిక మత్స్యకారుల సాయంతో సహాయక చర్యలు చేపట్టాయి. అగ్నిప్రమాదం తర్వాత ఏర్పడిన గందరగోళంలో కనీసం 18 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. వేల సంఖ్యలో దీవులు కలిగిన ఇండోనేషియాలో అంతర్-ద్వీప రవాణా కోసం తరచుగా పడవలపై ఎక్కువగా ప్రజలు ఆధారపడతారు. ఈ క్రమంలో తాజాగా నౌకలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.


