Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Indonesia: రాజకీయ నాయకులకు అధిక జీతాలు.. పార్లమెంట్ భవనాలను తగులబెట్టిన నిరసనకారులు

Indonesia: రాజకీయ నాయకులకు అధిక జీతాలు.. పార్లమెంట్ భవనాలను తగులబెట్టిన నిరసనకారులు

Indonesians Burn Parliament Buildings: ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియా ఇప్పుడు ఆందోళనలతో అట్టుడుకుతోంది. ప్రభుత్వ విధానాలు, ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ నాయకుల అధిక వేతనాలు నిరసనలకు దారి తీశాయి. దేశవ్యాప్తంగా సాగిన హింసాత్మక ఆందోళనలు, అల్లర్లలో ఏడుగురు మరణించడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇవి నూతన అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటోకు ఒక పెద్ద సవాలుగా నిలుస్తున్నాయి.

- Advertisement -

ALSO READ: India-Russia Oil Deal: అమెరికా ఆంక్షల వేళ భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్

నిరసనకారులు పలు నగరాల్లో ప్రాంతీయ పార్లమెంట్ భవనాలను, పోలీసు ప్రధాన కార్యాలయాలను, ఇతర ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టారు. ఈ ఆందోళనల్లో దోపిడీలు, వాహనాల దహనం వంటి సంఘటనలు కూడా జరిగాయి.

ఓ వైపు నిరుద్యోగం.. మరో వైపు 10 రెట్లు అధిక జీతభత్యాలు..

ఈ అల్లర్లకు ప్రధాన కారణం, ఇండోనేషియా పార్లమెంట్ సభ్యులకు ఇస్తున్న అధిక జీతభత్యాలు. నివేదికల ప్రకారం, పార్లమెంట్‌లోని 580 మంది సభ్యులకు వారి జీతాలతో పాటు, నెలవారీ గృహ భత్యంగా 50 మిలియన్ రుపియా ($3,075) అందుతోంది. ఇది జకార్తాలో కనీస వేతనం కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ. దేశంలో నిరుద్యోగం, పెరుగుతున్న జీవన వ్యయం, పన్నుల భారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ అధిక భత్యాలు ప్రజాగ్రహానికి కారణమయ్యాయి.

ALSO READ: Shehbaz Sharif : భారత్-రష్యా సంబంధాలు అద్భుతం.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్

ఈ నిరసనలు మరింత హింసాత్మకంగా మారడానికి మరొక కారణం 21 ఏళ్ల రైడ్-హెయిలింగ్ డ్రైవర్ అఫ్ఫాన్ కుర్నియావాన్ మరణం. నిరసనల సమయంలో ఒక సాయుధ వాహనం కుర్నియావాన్‌ను ఢీకొట్టి, అతను పడిపోయిన తర్వాత కూడా అతనిపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, దేశవ్యాప్తంగా భద్రతా బలగాలపై తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. మక్సర్‌లో జరిగిన అల్లర్లలో ముగ్గురు, యోగ్యకార్తలో ఒక విద్యార్థి, సోలో నగరంలో ఒక వృద్ధుడు ఇలా మొత్తం ఏడుగురు మరణించారు.

వెనక్కి తగ్గిన ప్రభుత్వం..

పరిస్థితి విషమించడంతో అధ్యక్షుడు సుబియాంటో చైనా పర్యటనను రద్దు చేసుకుని, నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని భద్రతా బలగాలను ఆదేశించారు. అయితే, ప్రజల ఆగ్రహాన్ని గుర్తించిన ప్రభుత్వం, పార్లమెంటేరియన్ల అధిక భత్యాలను రద్దు చేస్తామని, వారి విదేశీ పర్యటనలను కూడా నిలిపివేస్తామని ప్రకటించింది. కుర్నియావాన్ మరణంపై పారదర్శక దర్యాప్తుకు ఆదేశించినట్లు కూడా తెలిపారు. ఈ చర్యలను విశ్లేషకులు ప్రభుత్వ అరుదైన రాయితీగా చూస్తున్నారు.

ALSO READ: Kim Jong Un: ప్రత్యేక రైలులో చైనాకు కిమ్..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad