Sunday, October 6, 2024
Homeఇంటర్నేషనల్Inflation: కిలో ఉల్లి రూ.887..ఊపందుకున్న ఉల్లి స్మగ్లింగ్

Inflation: కిలో ఉల్లి రూ.887..ఊపందుకున్న ఉల్లి స్మగ్లింగ్

ఉల్లిపాయలు లేకుండానే వంట చేసుకోవటం ఫిలిప్పైన్స్ ప్రజలు అలవాటు చేసుకుంటున్నారు. కిలో 887 రూపాయలు పెట్టి కొనలేక వాటిని తినటమే మానేస్తున్నారు. ఫిలిప్పీన్స్ కరెన్సీలో కిలో ఉల్లి 600 పెసోలు. ఒక పౌండ్ ఎర్ర ఉల్లిపాయలు ఇక్కడ ఒక పౌండ్ మాంసం కంటే ఎక్కువ ధరే. గ్లోబల్ ఇన్ ఫ్లేషన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. క్లైమేట్ ఛేంజ్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా దెబ్బతిన్న సప్లై చైన్ వల్ల ఇలా ఉల్లి ధరలు కొండెక్కాయి. ప్రస్తుతం ఫిలిప్పైన్స్ లో ధరాఘాతం ఆల్ టైం హైలో ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇలాగే ఆనియన్స్ ధరలు పెరిగితే సామాన్యులు తిరుగుబాటు చేస్తారనే భయంతో సర్కారు వణుకుతోంది. దీంతో మార్చ్ నెలాఖరుకల్లా కనీసం 22,000 టన్నుల ఉల్లిని దిగుమతి చేసేందుకు ఆర్డర్ పెట్టింది. మరోవైపు చైనా నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్న ఉల్లిని ఫిలిప్పైన్స్ అధికారులు సీజ్ చేశారు. ఇలా చైనా నుంచి ఉల్లి స్మగ్లింగ్ ఫిలిప్పైన్స్ లోకి బాగా ఊపందుకుంటోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News