Homeఇంటర్నేషనల్Iran Internet: చీకట్లో ఇరాన్‌ పౌరులు.. 864 గంటలుగా ఇంటర్నెట్‌ బంద్

Iran Internet: చీకట్లో ఇరాన్‌ పౌరులు.. 864 గంటలుగా ఇంటర్నెట్‌ బంద్

Iran Internet Bandh: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం నేటికి ఇరాన్‌లో ఇంటర్నెట్‌ సేవలు బంద్‌ అయి 864 గంటలు అంటే సుమారు 37 రోజులు పూర్తయింది. ఒక దేశంలో ఇన్ని గంటల పాటు నిరంతరాయంగా ఇంటర్నెట్ బంద్ కావడం ప్రపంచంలోనే ఇది మొదటిసారిగా కావడంతో రికార్డు సృష్టించింది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/sports-news/ipl-2026-season-19-lsg-beat-srh-by-5-wickets/

ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన వైమానిక దాడులు జరిపాయి. ఈ నేపథ్యంలో జాతీయ భద్రత దృష్ట్యా ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధించింది. దీంతో దాదాపు 37 రోజులుగా కొనసాగుతున్న ఈ షట్‌డౌన్ వల్ల ఇరాన్ పౌరులు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ క్రమంలో గతంలో నమోదైన అన్ని రికార్డులను ఇరాన్‌ అధిగమించింది. సుదీర్ఘకాలం పాటు కొనసాగిన జాతీయ స్థాయి షట్‌డౌన్‌గా నిలిచింది. ఈ మేరకు డిజిటల్ వాచ్‌డాగ్ NetBlocks సమాచారం వెల్లడించింది.

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/cm-chandrababu-announces-100-days-action-plan-for-water-conservation/

ఇరాన్‌లో సాధారణ ఇంటర్నెట్ సేవలతో పాటు VPNలు, వాట్సాప్‌, టెలిగ్రామ్‌ వంటి మెసేజింగ్ యాప్‌లు, స్టార్‌లింక్ సేవలను కూడా ప్రభుత్వం ‘కిల్ స్విచ్’ పరికరాల ద్వారా నియంత్రించింది. దీంతో ఆ దేశంలో ఈ సుదీర్ఘ షట్‌డౌన్ వల్ల ఇరాన్ ప్రభుత్వం ప్రతి గంటకు సుమారు 1.56 మిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నట్లు సమాచారం. అయితే అమెరికా- ఇరాన్‌ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ బ్లాక్‌అవుట్ ఎప్పుడు ముగుస్తుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News