Homeఇంటర్నేషనల్Strait of Hormuz: హర్మూజ్‌పై ఇరాన్‌ కీలక ప్రకటన.. నౌకల రాకపోకలను లైన్‌ క్లియర్‌

Strait of Hormuz: హర్మూజ్‌పై ఇరాన్‌ కీలక ప్రకటన.. నౌకల రాకపోకలను లైన్‌ క్లియర్‌

Strait of Hormuz: హర్మూజ్‌ జలసంధిపై ఇరాన్‌ కీలక ప్రకటన చేసింది. అమెరికా-ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో హర్మూజ్‌ జలసంధిని మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడీ జలసంధిని పూర్తిగా తెరిచినట్లు తాజాగా ఇరాన్‌ ప్రకటించింది. అంతేకాదు అన్ని వాణిజ్య రాకపోకలకు అనుమతించిననున్నట్టు ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ వెల్లడించారు.

- Advertisement -

ఇరాక్ విదేశాంగ మంత్రి ట్వీట్
ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఇజ్రాయెల్‌-లెబనాల్‌ సీజ్‌ఫైర్‌(కాల్పుల విరమణ) ఒప్పందంతో హర్మూజ్‌ జలసంధిని తెరుస్తున్నట్లు  ఇరాన్‌ స్పష్టం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందంలో ఉన్నంత వరకు హర్మూజ్‌ తెరిచే ఉంటుందని తెలిపారు. ఈ ప్రకటనపై పశ్చిమా దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా దుబాయ్‌, కువైట్‌, ఖతర్‌ వంటి అరెబియన్‌ దేశాలు ఈ ప్రకటనతో ఊపిరి పీల్చుకున్నాయి. కాగా హర్మూజ్‌ జలసంధిపై ఇరాన్‌ ప్రకటనతో నౌకల రాకపోకలు యధావిధిగా కొనసాగనున్నాయి.

లెబనాన్-ఇజ్రామెల్ ఒప్పందం
అదే సమయంలో హర్మూజ్‌ను తెరవడంతో చమురు ధరలు భారీగా పడిపోయాయి. కాగా, లెబనాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు తాత్కాలికంగా ఈ యుద్ధానికి విరామం ఇవ్వాలని నిర్ణయించాయి. ఈ విషయాన్ని గురువారం రాత్రి స్వయంగా ట్రంప్‌ ప్రకటించారు. దీంతో అమెరికా-ఇరాన్‌ మధ్య శాశ్వత శాంతి ఒప్పందం కుదిరేందకు లెబనాన్‌-ఇజ్రాయెల్‌ కాల్పుల విరమణ అంగీకారం శుభపరిణామంగా అభిప్రాయపడుతున్నారు.

Also Read: Raashi Khanna: షూటింగ్‌ సెట్లో హీరోయిన్‌ రాశీ ఖన్నాకు చేదు అనుభవం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News