HomeTop StoriesIran attacks: అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడులు.. వెల్లడించిన ఐఆర్జీసీ

Iran attacks: అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడులు.. వెల్లడించిన ఐఆర్జీసీ

Iran attacks: పశ్చిమాసియాలో శాంతి చర్చలు జరుగుతున్న తరుణంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కువైట్‌, బహ్రెయిన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్‌ భారీ ఎత్తున క్షిపణులు, డ్రోన్లతో దాడులకు తెగబడింది. ఈ దాడులను ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) అధికారికంగా ధృవీకరించింది.

- Advertisement -

ప్రతీకారంతో దాడులు: నిన్న ఖేష్మ్‌ ద్వీపంలోని తమ సైనిక స్థావరాలపై అమెరికా దళాలు దాడికి పాల్పడ్డాయి. దీంతో ప్రతీకారంతో ఈ దాడులు చేపట్టినట్లు ఐఆర్జీసీ స్పష్టం చేసింది. అమెరికా చర్యలకు తగిన బుద్ధి చెప్పేందుకే కువైట్, బహ్రెయిన్లలోని యూఎస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ వెల్లడించింది.

Also Read-Trump: శాంతి చర్చలు విఫలమైతే యుద్ధమే.. ట్రంప్‌ సంచలన హెచ్చరిక!

అప్రమత్తమైన కువైట్ రక్షణ వ్యవస్థలు: మరోవైపు ఇరాన్ పంపిన డ్రోన్లు, క్షిపణులను తాము విజయవంతంగా తిప్పికొడుతున్నట్లు కువైట్‌ ఆర్మీ జనరల్‌ స్టాఫ్‌ ప్రకటించారు. తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ రంగంలోకి దిగి ఇరాన్ దాడులను అడ్డుకుంటున్నామని తెలిపారు. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ పరస్పర దాడులతో పశ్చిమాసియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని యుద్ధ వాతావరణం నెలకొంది. శాంతి చర్చల ప్రక్రియకు ఈ పరిణామాలు గట్టి విఘాతం కలిగించేలా ఉన్నాయని అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News