Iran Interim Supreme Leader: అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా ఇరాన్ సైతం క్షిపణుల సాయంతో అమెరికా బేస్‌లే లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అలిరెజా అరాఫీని నియమితులయ్యారు. పరిపాలన కోసం ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేశారు.
Also Read: https://teluguprabha.net/international-news/khamenie-death-iran-missile-attacks-target-us-bases/
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో.. ఆయన వారసుడిగా అయతొల్లా అలిరెజా అరాఫీని తాత్కాలిక సుప్రీం లీడర్‌గా కొనసాగనున్నారు. ఈ మేరకు ఆదివారం నిర్ణయం తీసుకున్నారు. టెహ్రాన్‌లోని నివాసంపై అమెరికా- ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఖమేనీ మరణించినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇస్లామిక్ విప్లవ నేత ఖొమేనీ మరణం తర్వాత, 1989 నుంచి ఖమేనీ.. ఇరాన్ అత్యున్నత నాయకుడిగా పరిపాలన సాగిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఖమేనీ మరణం తర్వాత దేశ పాలనా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కౌన్సిల్ నియామకమైంది.
ఈ కౌన్సిల్‌లో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, జ్యుడీషియరీ చీఫ్ గులాంహొస్సేన్ మొహసెని ఎజెయి, గార్డియన్ కౌన్సిల్ జ్యూరిస్ట్ ఉంటారని ‘ఐఆర్‌ఎన్‌ఏ’ (ఐఆర్ఎన్ఏ) వార్తా సంస్థ వెల్లడించింది. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం.. 88 మంది సభ్యులున్న అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ తదుపరి పూర్తిస్థాయి సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే వరకు ఈ కౌన్సిల్ బాధ్యతలు చేపడుతుంది.
Also Read: https://teluguprabha.net/devotional-news/holi-2026-chandra-grahan-special-significance-india/
1959లో ఇరాన్‌లోని మేబోద్‌లో జన్మించిన అయతొల్లా అరాఫీ.. షియా మతగురువుగా, ఇస్లామిక్ న్యాయనిపుణుడిగా పేరు ప్రఖ్యాతలు గడించారు. 2016 నుంచి ఇరాన్ ఇస్లామిక్ సెమినరీస్ మేనేజ్‌మెంట్ సెంటర్ హెడ్‌గా, ప్రఖ్యాత కోమ్ సెమినరీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. దేశ చట్టాలను, ఎన్నికలను పర్యవేక్షించే శక్తివంతమైన గార్డియన్ కౌన్సిల్‌లో కూడా ఆయన సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. గతంలోనూ 2008 నుంచి 2018 వరకు అల్-ముస్తఫా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌గా కూడా అరాఫీ సేవలందించినట్లు రష్యన్ మీడియా సంస్థ ‘ఆర్టీ’ (ఆర్టీ) కథనం వెల్లడించింది.

