Homeఇంటర్నేషనల్Iran: ఇరాన్‌లో పెద్ద సంఖ్యలో సామూహిక వివాహాలు.. కారణమేంటో తెలుసా?

Iran: ఇరాన్‌లో పెద్ద సంఖ్యలో సామూహిక వివాహాలు.. కారణమేంటో తెలుసా?

Iran is holding mass weddings: ఇరాన్‌పై మళ్లీ అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు చేసే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా యువ జంటలకు సామూహిక వివాహాలు చేస్తోంది. వివాహాలను ప్రోత్సహించడం, ఇస్లామిక్ సంస్కృతిని కాపాడటం, నేటి యువతకు పెళ్లి ఖర్చుల భారం లేకుండా చౌకగా వివాహాలు జరిగేలా చూడటమే దీని వెనుకున్న ప్రధాన ఉద్దేశ్యంగా పేర్కొంది. ఈ నేపథ్యంలోనే రాజధాని టెహ్రాన్‌లో సోమవారం దాదాపు వెయ్యి జంటలకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఆధ్వర్యంలో పెళ్లిల్లు జరిగాయి. ఈ వివాహాలను పర్షియన్ భాషలో “జౌజ్-ఎ-జాన్ఫిదా” అని పిలుస్తారు. అంటే ‘త్యాగానికి అంకితమైన జంటలు’ అని దీని అర్థం. ఇమామ్ హుస్సేన్ స్క్వేర్ లాంటి ప్రధాన కూడళ్లలో రాత్రి 8 గంటలకు ఈ నూతన జంటల ఊరేగింపు ప్రారంభమయ్యింది. అజాదీ స్క్వేర్ వరకు ఊరేగింపు కొనసాగింది. షియా సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే ప్రవక్త అలీ, ప్రవక్త ఫాతిమాల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఇరాన్ సైన్యం ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించింది. ఇలాంటి కార్యక్రమాలు శత్రువులను మానసికంగా నిరుత్సాహపరుస్తాయని, అలాగే ఇరాన్ యువతలో దేశభక్తి, త్యాగ స్ఫూర్తిని నింపుతాయని ఇరాన్ సైన్యం డిప్యూటీ కల్చరల్ చీఫ్ రహీమ్ నదాలీ పేర్కొన్నారు. ఇరాన్ పౌరులు తమ ప్రాణాలను త్యాగం చేసేందుకు రెడీగా ఉన్నారని ప్రపంచానికి చాటిచెప్పే ‘జన్-ఫాదా’ ఉద్యమానికి కొనసాగింపుగానే ఐఆర్‌జీసీ ఈ సామూహిక వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

- Advertisement -

Also read: https://teluguprabha.net/telangana/kaleshwaram-saraswati-antya-pushkaralu-arrangements/

అమెరికా, ఇజ్రాయెల్‌ను అంతమొందించడమే లక్ష్యంగా..

ఈ జాతీయవాద ప్రచారం కోసం ఐఆర్‌జీసీ అధికారికంగా janfadaa.ir అనే వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించింది. ఇప్పటికే లక్షలాది మంది ఇరాన్‌ పౌరులు ఈ వెబ్‌సైట్‌లో తమ పేర్లను ఎంట్రీ చేసుకున్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌లను అంతమొందిస్తామని ప్రతిజ్ఞ చేయడమే లక్ష్యంగా ఈ ప్రచారం నడుస్తోంది. ఇరాన్ సైన్యం చేపట్టిన ఈ చొరవ దేశాన్ని ఏకం చేస్తోందని.. యువతలో ఉత్సాహాన్ని నింపుతూ సాంప్రదాయ వివాహాలను దేశభక్తితో అనుసంధానిస్తుందని ఐఆర్‌జీసీ మద్దతుదారులు ప్రశంసిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News