Homeఇంటర్నేషనల్USA-Iran War: దిగివచ్చిన ఇరాన్.. హార్మూజ్ తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్!

USA-Iran War: దిగివచ్చిన ఇరాన్.. హార్మూజ్ తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్!

USA-Iran: అమెరికా, ఇరాన్‌ మధ్య చర్చలు జరుగుతున్న వేళ ఇరాన్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. అమెరికాతో యుద్ధాన్ని ముగించేందుకు హార్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ కొత్త ప్రతిపాదనలు తీసుకువచ్చినట్టు ఓ అమెరికన్ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది.

- Advertisement -

అమెరికన్ మీడియా సంస్థ యాక్సియోస్ ప్రకారం.. ‘అమెరికాతో యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ దిగివచ్చింది. హార్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ నిర్ణయం తీసుకుంది. తన ప్రతిపాదనలను మధ్యవర్తిత్వం చేస్తున్న పాకిస్తానీ అధికారుల ద్వారా అమెరికాకు చేరవేసింది. వివాదాస్పద అణు చర్చలను తదుపరి దశకు వాయిదా వేస్తున్నట్లు ఆ ప్రతిపాదనలో పేర్కొంది’ అని వెల్లడించింది. కాగా, పశ్చిమాసియా సైనిక ఘర్షణల నేపథ్యంలో ఇరాన్‌ కొత్త ప్రతిపాదన కీలక పరిణామంగా ఆ మీడియా కథనం అభివర్ణించింది. యాక్సియోస్ ప్రకారం.. వైట్‌హౌస్‌కు ఈ ప్రతిపాదన అందింది.

కానీ, దీనిని పరిశీలించడానికి యునైటెడ్ స్టేట్స్ సుముఖంగా ఉందో లేదో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే, చర్చలకు సిద్ధమైతే ఇరాన్ ఎప్పుడైనా తమకు సందేశాన్ని పంపొచ్చని ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు పొందే అవకాశాన్ని ఇరాన్‌కు ఇచ్చేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈనేపథ్యంలో యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ పంపిన కొత్త ప్రతిపాదనలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇక, ఇరు దేశాల మధ్య స్తంభించిపోయిన శాంతి ప్రయత్నాల మధ్య ఈ ప్రతిపాదన వచ్చింది.

యుద్ధానికి ముగింపు?
మరోవైపు ఇరాన్ కనీసం ఒక దశాబ్దం పాటు యురేనియం శుద్ధిని నిలిపివేయాలని, ప్రస్తుతం ఉన్న నిల్వలను దేశం నుండి తరలించాలని అమెరికా డిమాండ్ చేసింది. అయితే, నివేదిక ప్రకారం.. ఈ డిమాండ్లకు ఎలా స్పందించాలనే దానిపై ఇరాన్ నాయకత్వంలో ఏకాభిప్రాయం లేదని ఆ దేశ విదేశాంగ మంత్రి, ప్రధాన సంధానకర్త అబ్బాస్ అరఘ్చి వారాంతంలో మధ్యవర్తులతో చెప్పారు. పాకిస్తానీ మధ్యవర్తుల ద్వారా తెలియజేసిన రెండు దశల ప్రణాళికలో మొదట హార్మూజ్ జలసంధిపై సంక్షోభాన్ని పరిష్కరించడం, అమెరికా దిగ్బంధనాన్ని ముగించడంపై ప్రాధాన్యత ఇస్తుంది. కొత్త ప్రతిపాదన ప్రకారం.. కాల్పుల విరమణను సుదీర్ఘ కాలం పాటు పొడిగించడమో లేదా యుద్ధానికి శాశ్వత ముగింపు పలకడమో చేయాలి. జలసంధిని తిరిగి తెరిచి దిగ్బంధనాన్ని ఎత్తివేసిన తర్వాత తదుపరి దశలో మాత్రమే అణు చర్చలు ప్రారంభించాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News