Homeఇంటర్నేషనల్Iran: అమెరికాతో యుద్ధంలోనే ఉన్నాం.. ఇరాన్‌ సంచలన ప్రకటన

Iran: అమెరికాతో యుద్ధంలోనే ఉన్నాం.. ఇరాన్‌ సంచలన ప్రకటన

USA-Iran War: అమెరికాతో తమ దేశం పూర్తిస్థాయి యుద్ధ పరిస్థితులను ఎదుర్కొంటోందని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ వ్యాఖ్యానించారు. యుద్ధ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచడం అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. టెహ్రాన్‌లో నిర్వహించిన హై కౌన్సిల్ ఆఫ్ ది జుడీషియరీ సమావేశంలో మాట్లాడిన పెజెష్కియాన్. ప్రస్తుత యుద్ధం కేవలం క్షిపణులు, సైనిక దాడులకు మాత్రమే పరిమితం కాదన్నారు.

- Advertisement -

బహుముఖ పోరాటం..
ఇది బహుముఖ పోరాటమని, మిలిటరీ చర్యలతో ఇరాన్ ప్రజలను లొంగదీసుకోవడం సాధ్యం కాదని శత్రువులు గ్రహించారని పేర్కొన్నారు. యుద్ధం వల్ల కలిగే ప్రభావాలను ప్రజలు అర్థం చేసుకుని, దేశ ప్రయోజనాల కోసం ప్రతిఘటన కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఇరాన్‌పై హైబ్రిడ్ యుద్ధం కొనసాగుతోందని ఆరోపించిన ఆయన ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటం సామాజిక వనరులను పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యతలని తెలిపారు. అమెరికాతో జరిగిన చర్చల్లో జూన్ 18న కుదిరిన అవగాహన ఒప్పందం సహా అన్ని దశల్లో ఇరాన్ జాతీయ హక్కులు ప్రయోజనాలను తమ ప్రభుత్వం సమర్థంగా రక్షించిందని చెప్పారు.

మరింత పెరిగిన ఉద్రిక్తతలు 
ఇదిలా ఉండగా వాణిజ్య నౌకలకు ముప్పుగా భావిస్తున్న ఇరాన్ సామర్థ్యాన్ని బలహీనపర్చే లక్ష్యంతో అమెరికా ఇటీవల దక్షిణ ఇరాన్‌లోని పలు ప్రాంతాలపై వరుస దాడులు నిర్వహించినట్లు సమాచారం. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్, కువైట్, బహ్రెయిన్, జోర్డాన్ వంటి దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, ఇతర సదుపాయాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. రెండు దేశాల మధ్య గతంలో కుదిరిన అవగాహన ప్రకారం తుది ఒప్పందానికి చేరుకునేందుకు 60 రోజుల వ్యవధిలో చర్చలు జరగాల్సి ఉన్నప్పటికీ తాజా పరిణామాలతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

Also Read: Kokapet Lands: కోకాపేట్‌లో మరో మెగా వెంచర్‌.. రూ.9 వేల కోట్ల ఆదాయంపై సర్కార్‌ ఫోకస్‌

మరోవైపు, అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్‌పై మరో విడత సైనిక చర్యలు ప్రారంభించినట్లు ప్రకటించడంతో సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు దక్షిణ, మధ్య ఇరాన్‌లో పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. హోర్మోజ్గాన్ ప్రావిన్స్‌లోని బందర్ అబ్బాస్, సిరిక్, బందర్ లెంగే, ఖేష్మ్ ప్రాంతాలతో పాటు సిస్తాన్ అండ్ బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని చాబహార్, కొనారక్ ప్రాంతాల్లో పేలుళ్లు చోటుచేసుకున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News