Friday, July 11, 2025
Homeఇంటర్నేషనల్Middle East Uncertainty: అమెరికాతో అణు చర్చలకు ఇరాన్ నిరాకరణ!

Middle East Uncertainty: అమెరికాతో అణు చర్చలకు ఇరాన్ నిరాకరణ!

Iran Rejects Nuclear Talks with US: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత జఠిలమవుతున్నాయి. అమెరికాతో ఎలాంటి అణు చర్చలు జరిపే ఉద్దేశం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ స్పష్టం చేశారు. ఇటీవల ఇజ్రాయెల్, అమెరికా దాడుల వల్ల తమ అణు స్థావరాలకు గణనీయమైన నష్టం వాటిల్లిందని, వాటి పునరుద్ధరణపై అధ్యయనం జరుగుతోందని ఆయన వెల్లడించారు.

ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడి, తీవ్ర నష్టం: జూన్ 22, 2025న అమెరికా ఇరాన్‌లోని కీలక అణు స్థావరాలైన ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌లపై వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల కారణంగా తమ అణు మౌలిక సదుపాయాలకు భారీ నష్టం వాటిల్లిందని ఇరాన్ వెల్లడించింది. అమెరికా చర్యను ఐక్యరాజ్యసమితి చార్టర్ ఉల్లంఘనగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ తీవ్రంగా ఖండించారు.

ఈ దాడుల నేపథ్యంలో, అమెరికాతో అణు చర్చలను పునఃప్రారంభించే అవకాశం పరిశీలనలో ఉందని అరఘ్చీ పేర్కొన్నారు. అయితే, ఏవైనా చర్చలు ఇరాన్ జాతీయ ప్రయోజనాలను పరిరక్షించాయా లేదా అనే అంశంపైనే ఆధారపడి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో అనిశ్చితిని మరింత పెంచుతున్నాయి.

ట్రంప్ చర్చల ప్రతిపాదనకు ఇరాన్ తిరస్కరణ: నాటో శిఖరాగ్ర సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెహ్రాన్‌తో అణు చర్చలు జరుపుతామని, ఆంక్షలు సడలిస్తామని ప్రకటించారు. అయితే, ఇరాన్ ఈ ప్రతిపాదనను వెంటనే తిరస్కరించింది. తమ అణు కేంద్రాలపై అమెరికా దాడి చేసిన తర్వాత చర్చలకు తావు లేదని, ఇది అమెరికా ప్రారంభించిన యుద్ధమని, దానికి తామే ముగింపు ఇస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ అణు కార్యక్రమం చెక్కుచెదరలేదని, వేగంగా పునరుద్ధరిస్తామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఖలీబాఫ్ తెలిపారు.

వైట్ హౌస్ స్పందన – ఖతార్ మధ్యవర్తిత్వం: ఇరాన్ ప్రకటనలపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లీవిట్ స్పందించారు. ప్రస్తుతం ఇరాన్‌తో చర్చలు జరపడం లేదని, అయితే ఖతార్ మధ్యవర్తిత్వంతో భవిష్యత్తులో చర్చలు పునఃప్రారంభించే అవకాశం ఉందని ఆమె తెలిపారు.

ఇజ్రాయెల్‌పై విజయం, అమెరికాపై ప్రతీకారం ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌పై విజయం సాధించామని, అమెరికాను చాచి లెంపకాయ కొట్టామని ఆయన అన్నారు. ఖతార్‌లోని అతిపెద్ద అమెరికా సైనిక స్థావరమైన అల్ ఉదైద్‌ను తమ క్షిపణులతో ధ్వంసం చేశామని ఖమేనీ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ను కాపాడేందుకే అమెరికా జోక్యం చేసుకుందని, అయితే అది విఫలమైందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ దాడులను అడ్డుకున్నామని అమెరికా ప్రకటించినా, తాము భారీ నష్టాన్ని కలిగించామని ఇరాన్ నొక్కి చెప్పింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News